Kamduva nappadanumdi kaasugunnaamdu

కందువ నప్పటనుండి కాచుకున్నాఁడు
Language

(॥పల్లవి॥)
కందువ నప్పటనుండి కాచుకున్నాఁడు
విందువలెఁ గాంతునికి విడెమియ్యవే

(॥కందువ॥)
మనసులెనసితేను మఱఁగులేమిటికి
చనవులు గలితేను సాదింపులేలా
వొనరి యాతఁడు నిన్ను నొడివట్టి తీసీని
అనుమానమేల యిఁక నట్టే సేయవే

(॥కందువ॥)
మాటలు సమ్మతమైతే మరి జాగులేమిటికే
కూటములొనగూడి తే గుట్టులవేల
యీటుతోడ నాతఁడు నిన్నింపులతోఁ జెనకీని
చాటువగాఁ బెనఁగక సమ్మతించవే

(॥కందువ॥)
రతులు సరివచ్చితే రవ్వసేయనేమిటికే
తతి నొక్కచో నుండితే తమకమేలా
యితవై శ్రీవేంకటేశుఁడేలి నీతో నవ్వీని
కతల జోలిఁ బెట్టక కాఁగిలించవే

(||pallavi||)
kaṁduva nappaḍanuṁḍi kāsugunnām̐ḍu
viṁduvalĕm̐ gāṁtunigi viḍĕmiyyave

(||kaṁduva||)
manasulĕnasidenu maṟam̐gulemiḍigi
sanavulu galidenu sādiṁpulelā
vŏnari yādam̐ḍu ninnu nŏḍivaṭṭi tīsīni
anumānamela yim̐ka naṭṭe seyave

(||kaṁduva||)
māḍalu sammadamaide mari jāgulemiḍige
kūḍamulŏnagūḍi te guṭṭulavela
yīḍudoḍa nādam̐ḍu ninniṁpuladom̐ jĕnagīni
sāḍuvagām̐ bĕnam̐gaga sammadiṁchave

(||kaṁduva||)
radulu sarivachchide ravvaseyanemiḍige
tadi nŏkkaso nuṁḍide tamagamelā
yidavai śhrīveṁkaḍeśhum̐ḍeli nīdo navvīni
kadala jolim̐ bĕṭṭaga kām̐giliṁchave