Kamduva mee nichchagalyaanamunagu

కందువ మీ నిచ్చకల్యాణమునకు
Language

(॥పల్లవి॥)
కందువ మీ నిచ్చకల్యాణమునకు
అందములాయను అదన నివి

(॥కందు॥)
కలువలసేసలు కలికికి నీకును
సొలవక చూచేటిచూపు లివి
చిలుకులు మొల్లలసేసలు మీలో
నలుగడ ముసిముసి నవ్వులివి

(॥కందు॥)
తామరసేసలు తలకొనె మీకును
మోము మోమొరయుముద్దు లివి
సేమంతిసేసలు చెలియకు నీకును
చేమిరిగోళ్లచెనకు లివి

(॥కందు॥)
సంపెంగసేసలు సమరతి మీకును
ముంపులవూర్పులమూఁక లివి
యింపుల శ్రీవేంకటేశ చెలిఁ గలసి
సంపదఁ దేలితి చనవు లివి

(||pallavi||)
kaṁduva mī nichchagalyāṇamunagu
aṁdamulāyanu adana nivi

(||kaṁdu||)
kaluvalasesalu kaligiki nīgunu
sŏlavaga sūseḍisūbu livi
silugulu mŏllalasesalu mīlo
nalugaḍa musimusi navvulivi

(||kaṁdu||)
tāmarasesalu talagŏnĕ mīgunu
momu momŏrayumuddu livi
semaṁtisesalu sĕliyagu nīgunu
semirigoḽlasĕnagu livi

(||kaṁdu||)
saṁpĕṁgasesalu samaradi mīgunu
muṁpulavūrbulamūm̐ka livi
yiṁpula śhrīveṁkaḍeśha sĕlim̐ galasi
saṁpadam̐ delidi sanavu livi