కందువ మాతోడి పొందు గలదే నీకు
(॥పల్లవి॥)
కందువ మాతోడి పొందు గలదే నీకు
విందు లెన్నిచోట్ల వెదకేవు నీవు
(॥॥)
వాసులకే పెనఁగీని వంతులకే వచ్చీని
ఆసలకే లాచీన అదివో యాపె
సేసలు వెట్టిఁగరాదా చెక్కులు నొక్కఁగరాదా
రాసికెక్క నెక్కడ పరాకు సేసేవు
(॥॥)
యెమ్మెలకే మలసీని యింపులకే సొలసీని
సొమ్ములకే కొసరీని చొక్కుచు నాపె
తమ్ముల మిడఁగరాదా దప్పులు దేర్చఁగరాదా
వుమ్మడి నెందాఁకా నీవు వూరకుండేవు
(॥॥)
పంతానకే కూడీని బంతికే నోరూరీని
యింతటా శ్రీవేంకటేశ యిప్పుడే యీకె
మంతన మాడఁగరాదా మమ్మునిట్టే యేలితివి
వింతగా నేమిటికి నివ్వెరఁగందేవు
(||pallavi||)
kaṁduva mādoḍi pŏṁdu galade nīgu
viṁdu lĕnnisoṭla vĕdagevu nīvu
(||||)
vāsulage pĕnam̐gīni vaṁtulage vachchīni
āsalage lāsīna adivo yābĕ
sesalu vĕṭṭim̐garādā sĕkkulu nŏkkam̐garādā
rāsigĕkka nĕkkaḍa parāgu sesevu
(||||)
yĕmmĕlage malasīni yiṁpulage sŏlasīni
sŏmmulage kŏsarīni sŏkkusu nābĕ
tammula miḍam̐garādā dappulu dersam̐garādā
vummaḍi nĕṁdām̐kā nīvu vūraguṁḍevu
(||||)
paṁtānage kūḍīni baṁtige norūrīni
yiṁtaḍā śhrīveṁkaḍeśha yippuḍe yīgĕ
maṁtana māḍam̐garādā mammuniṭṭe yelidivi
viṁtagā nemiḍigi nivvĕram̐gaṁdevu