(॥పల్లవి॥)
కందుఁగుందు నింత గావలెనా
అందరిలోపల నవుననరాదా
(॥॥)
చేరి నాపొందులు చిత్తము రాకున్న
నారుకొనఁ గొంత నవ్వరాదా
మారుమాటాఁడగ మనసు రాకున్న
వూరకైనఁ గొంత వూఁకొనరాదా
(॥॥)
పైకొని నారాక పరాకై యుండిన
చౌకగాఁ బైఁ జేయి చాఁచరాదా
యేకడో నీచిత్త మెరవై యుండిన
ఆకుమడి చిచ్చే నందుకొనరాదా
(॥॥)
కాఁగిట నీమేను కడుమఱచిన
వేఁగి నాపై మేనువేయరాదా
చేఁగవలపుల శ్రీవేంకటేశ్వర
పాఁగినరతులఁబంత మీరాదా
(||pallavi||)
kaṁdum̐guṁdu niṁta gāvalĕnā
aṁdarilobala navunanarādā
(||||)
seri nābŏṁdulu sittamu rāgunna
nārugŏnam̐ gŏṁta navvarādā
mārumāḍām̐ḍaga manasu rāgunna
vūragainam̐ gŏṁta vūm̐kŏnarādā
(||||)
paigŏni nārāga parāgai yuṁḍina
saugagām̐ baim̐ jeyi sām̐sarādā
yegaḍo nīsitta mĕravai yuṁḍina
āgumaḍi sichche naṁdugŏnarādā
(||||)
kām̐giḍa nīmenu kaḍumaṟasina
vem̐gi nābai menuveyarādā
sem̐gavalabula śhrīveṁkaḍeśhvara
pām̐ginaradulam̐baṁta mīrādā