Kamdugumdu namdarigim galiginade

కందుగుందు నందరికిఁ గలిగినదే
Language

(॥పల్లవి॥)
కందుగుందు నందరికిఁ గలిగినదే
అందులకే యలిగితే నంతలో నేమాయనే

(॥కందు॥)
నెలఁత నీమొగము వెన్నెలగాయఁ బొరుగున
అలరుఁదురుము చీఁకటదె చల్లీని
వలచినరమణుఁడు వడి నీతో నొకమాఁటు
అలిగి మాటడకున్న నందు కేమాయనే

(॥కందు॥)
మిక్కిలి నీమనసిది మెత్తనైతేఁ బొరుగున
గక్కనఁ జనుఁగొండలు గట్లాయను
చక్కనినీరమణుఁడు సరుస నిన్నోకమాటు
ఇక్కువ గోర నంటితే నిందుకేమాయనే

(॥కందు॥)
నడపుల నేనుగలు నటిఇంచఁ బొరుగున
నడుమ సింహము నీకు నటించీ నదె
అడరి శ్రీవేంకటేశుఁ డటు గాదు నీవుఁ దాను
కొడిఁ జంద్రుఁడు గల్వలై కూడిన మోమాయనే

(||pallavi||)
kaṁduguṁdu naṁdarigim̐ galiginade
aṁdulage yaligide naṁtalo nemāyane

(||kaṁdu||)
nĕlam̐ta nīmŏgamu vĕnnĕlagāyam̐ bŏruguna
alarum̐durumu sīm̐kaḍadĕ sallīni
valasinaramaṇum̐ḍu vaḍi nīdo nŏgamām̐ṭu
aligi māḍaḍagunna naṁdu kemāyane

(||kaṁdu||)
mikkili nīmanasidi mĕttanaidem̐ bŏruguna
gakkanam̐ janum̐gŏṁḍalu gaṭlāyanu
sakkaninīramaṇum̐ḍu sarusa ninnogamāḍu
ikkuva gora naṁṭide niṁdugemāyane

(||kaṁdu||)
naḍabula nenugalu naḍiiṁcham̐ bŏruguna
naḍuma siṁhamu nīgu naḍiṁchī nadĕ
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaḍu gādu nīvum̐ dānu
kŏḍim̐ jaṁdrum̐ḍu galvalai kūḍina momāyane