కందమువో ఇఁకమీఁద కడమ దొడమలెల్ల
(॥పల్లవి॥)
కందమువో ఇఁకమీఁద కడమ దొడమలెల్ల
చెంది నావద్దనే వుంటేఁ జెల్లదా పంతము
(॥కంద॥)
తా నాడఁగ నేనాడఁగఁ దారుకాణ లీడనేల
పోనీవే కడుఁగడుఁ బొద్దు వోయను
మేని మీఁది గురుతులు మేనిమీఁదనుండఁగాను
నానఁ బెట్టీ నిజములు నవ్వరాదా ఇందుకు
(॥కంద॥)
తా ముట్టఁగ నే ముట్టఁగఁ దడబాట్లీడనేల
యేమి సేసీ జేయనీవే ఇంతలోనేమి
దోమటిఁ దనచేఁతను దొంతులనే వుండఁగాను
యేమరించి కాఁగిలించీ నిది మేలుగాదా
(॥కంద॥)
తాఁగూడఁగ నేఁగూడఁగ తమకము లిఁకనేల
చేఁగదేర రతులెల్లఁ జెప్పఁగ నేల
వీఁగక శ్రీవేంటాద్రి విభుఁ డిట్టె నన్నుఁ గూడె
యేమరించి కాఁగిలించీ నిది మేలుగాదా
(||pallavi||)
kaṁdamuvo im̐kamīm̐da kaḍama dŏḍamalĕlla
sĕṁdi nāvaddane vuṁṭem̐ jĕlladā paṁtamu
(||kaṁda||)
tā nāḍam̐ga nenāḍam̐gam̐ dārugāṇa līḍanela
ponīve kaḍum̐gaḍum̐ bŏddu voyanu
meni mīm̐di gurudulu menimīm̐danuṁḍam̐gānu
nānam̐ bĕṭṭī nijamulu navvarādā iṁdugu
(||kaṁda||)
tā muṭṭam̐ga ne muṭṭam̐gam̐ daḍabāṭlīḍanela
yemi sesī jeyanīve iṁtalonemi
domaḍim̐ danasem̐tanu dŏṁtulane vuṁḍam̐gānu
yemariṁchi kām̐giliṁchī nidi melugādā
(||kaṁda||)
tām̐gūḍam̐ga nem̐gūḍam̐ga tamagamu lim̐kanela
sem̐gadera radulĕllam̐ jĕppam̐ga nela
vīm̐gaga śhrīveṁṭādri vibhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
yemariṁchi kām̐giliṁchī nidi melugādā