Kamdamu nee saridalu kadadaamkaanu

కందము నీ సరితలు కడదాఁకాను
Language

(॥పల్లవి॥)
కందము నీ సరితలు కడదాఁకాను
యిందరిలో నన్న మాఁట లేల బొంకే విఁకను

(॥కందము॥)
పంతగాఁడ వౌదువు పడఁతి నింత యెంచితి
వంత నీకుఁ బెద్దరిక మైతేఁ జాలు
వంతు లాడేవు పిలువ వచ్చినమాతోనె నీవు
యింత గుండెవాఁడ వైతే నెటు వొయ్యీఁ బనులు

(॥కందము॥)
నేరుపరి వౌదువు నెలఁతఁ బాసి వుంటివి
ఆరయ నీ కింత చవు లైఁతే జాలు
చేరువకు వచ్చి లో లో సిగ్గు వడే వప్పటిని
యీ రీతి నుండితేఁ జాలు నీడేరె మోహము

(॥కందము॥)
మంచివాఁడ వౌదువు మగువఁ గూడితి విట్టె
అంచెల నీ కిదే పని యైతేఁ జాలు
ముంచిన శ్రీవెంకటేశ మెదలె యిట్టుండ రాదా
యెంచేము నీ గుణములు యే మాయ నిపుడు

(||pallavi||)
kaṁdamu nī saridalu kaḍadām̐kānu
yiṁdarilo nanna mām̐ṭa lela bŏṁke vim̐kanu

(||kaṁdamu||)
paṁtagām̐ḍa vauduvu paḍam̐ti niṁta yĕṁchidi
vaṁta nīgum̐ bĕddariga maidem̐ jālu
vaṁtu lāḍevu piluva vachchinamādonĕ nīvu
yiṁta guṁḍĕvām̐ḍa vaide nĕḍu vŏyyīm̐ banulu

(||kaṁdamu||)
nerubari vauduvu nĕlam̐tam̐ bāsi vuṁṭivi
āraya nī kiṁta savu laim̐te jālu
seruvagu vachchi lo lo siggu vaḍe vappaḍini
yī rīdi nuṁḍidem̐ jālu nīḍerĕ mohamu

(||kaṁdamu||)
maṁchivām̐ḍa vauduvu maguvam̐ gūḍidi viṭṭĕ
aṁchĕla nī kide pani yaidem̐ jālu
muṁchina śhrīvĕṁkaḍeśha mĕdalĕ yiṭṭuṁḍa rādā
yĕṁchemu nī guṇamulu ye māya nibuḍu