Kamdamu nee samtalu gattigaa nimka

కందము నీ సంతలు గట్టిగా నిఁక
Language

(॥పల్లవి॥)
కందము నీ సంతలు గట్టిగా నిఁక
సందడిఁ బెండ్లాడేవేళ చాయ కెట్టు వచ్చేవో

(॥॥)
కుంచెవేసేయట్టియాపె కొప్పు దాఁకించెనంటాను
అంచలఁబంతములెల్లా నాడుకొనేవు
మించినరతివేళను మేనెల్లాఁదాఁకేయపుడు
వంచనలేక యెటువలె నోర్చేవో

(॥॥)
జూదమాడి వోడినాపె సొలసి తిట్టెనంటాను
తీదీపుల చలము సాదించఁ జూచేవు
పాదుకొని యేకతానఁ బచ్చిమాట లాడేవేళ
సాదవై నీవెట్లాను సమ్మతించేవో

(॥॥)
సేనలు వెట్టినయాపె సిగ్గులువడె నంటాను
వాసితోఁ జన్నులమీఁద వాఁత వాఁసేవు
యీసరినే శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
తాసువలె నిద్దరిని దయితో మన్నించేవో

(||pallavi||)
kaṁdamu nī saṁtalu gaṭṭigā nim̐ka
saṁdaḍim̐ bĕṁḍlāḍeveḽa sāya kĕṭṭu vachchevo

(||||)
kuṁchĕveseyaṭṭiyābĕ kŏppu dām̐kiṁchĕnaṁṭānu
aṁchalam̐baṁtamulĕllā nāḍugŏnevu
miṁchinaradiveḽanu menĕllām̐dām̐keyabuḍu
vaṁchanalega yĕḍuvalĕ norsevo

(||||)
jūdamāḍi voḍinābĕ sŏlasi tiṭṭĕnaṁṭānu
tīdībula salamu sādiṁcham̐ jūsevu
pādugŏni yegadānam̐ bachchimāḍa lāḍeveḽa
sādavai nīvĕṭlānu sammadiṁchevo

(||||)
senalu vĕṭṭinayābĕ sigguluvaḍĕ naṁṭānu
vāsidom̐ jannulamīm̐da vām̐ta vām̐sevu
yīsarine śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
tāsuvalĕ niddarini dayido manniṁchevo