Kambamulo vedalidivi kariraajum gaasidivi

కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి
Language

(॥పల్లవి॥)
కంబములో వెడలితివి కరిరాజుఁ గాచితివి
పంచి యిన్నిటా నీ కిది పనియటే శ్రీహరీ

(॥కంబము॥)
యెవ్వఁడూ మొఱవెట్టునో యిట్టె రక్షించే ననుచు
యెవ్వఁడూ ననుఁబేర్కొనునో యింతటాఁ బలికేననుచు
యెవ్వఁడూ మదిఁ దలఁచునో యిక్కువఁబొడచూపేననుచు
వువ్విళ్లూరఁ గాచుకొని వుందు వటే శ్రీహరీ

(॥కంబము॥)
ఆపన్నుఁడు శరణంటే నడ్డము వచ్చే ననుచు
యేపొద్దు ధ్యానించువానికి యెదుట నుండే ననుచు
పై పైఁ బూజించేవానికి పాదములు చాఁచే ననుచు
వోపి యెప్పుడు గాచుకొని వుందు వటే శ్రీహరీ

(॥కంబము॥)
అడిగి బొగడేవానికి నప్పుడే నొసఁగే ననుచు
చిడిముడి నీ దాసునికి చెప్పినట్టు సేసే ననుచు
బడినే శ్రీవేంకటేశ భక్తి సేసే వానికిని
వుడివోక కాచుకొని వుందు వటే శ్రీహరీ

(||pallavi||)
kaṁbamulo vĕḍalidivi karirājum̐ gāsidivi
paṁchi yinniḍā nī kidi paniyaḍe śhrīharī

(||kaṁbamu||)
yĕvvam̐ḍū mŏṟavĕṭṭuno yiṭṭĕ rakṣhiṁche nanusu
yĕvvam̐ḍū nanum̐bergŏnuno yiṁtaḍām̐ baligenanusu
yĕvvam̐ḍū madim̐ dalam̐suno yikkuvam̐bŏḍasūbenanusu
vuvviḽlūram̐ gāsugŏni vuṁdu vaḍe śhrīharī

(||kaṁbamu||)
ābannum̐ḍu śharaṇaṁṭe naḍḍamu vachche nanusu
yebŏddu dhyāniṁchuvānigi yĕduḍa nuṁḍe nanusu
pai paim̐ būjiṁchevānigi pādamulu sām̐se nanusu
vobi yĕppuḍu gāsugŏni vuṁdu vaḍe śhrīharī

(||kaṁbamu||)
aḍigi bŏgaḍevānigi nappuḍe nŏsam̐ge nanusu
siḍimuḍi nī dāsunigi sĕppinaṭṭu sese nanusu
baḍine śhrīveṁkaḍeśha bhakti sese vānigini
vuḍivoga kāsugŏni vuṁdu vaḍe śhrīharī