Kamalaaramana neegalbidabumaanisini

కమలారమణ నీకల్పితపుమానిసిని
Language

(॥పల్లవి॥)
కమలారమణ నీకల్పితపుమానిసిని
తమితోడ నాదిక్కు దయఁ జూడవే

(॥కమ॥)
ఆరీతి బ్రాహ్మణుఁడ ననుటేకాని దేహము
కోరి యాచారమునకుఁ గొలుపదు
పేరు వైష్ణవుఁడననే పెద్దరికమే కాని
సారమైన మనసులో జ్ఞానమే లేదు

(॥కమ॥)
చదివితిననియెడి చలపాద మింతే కాని
అదన నందులోని ‌అర్థ మెఱఁగ
పదిరిసంసారమనే బహురూపమే కాని
చతురుఁదనాన నందు సమర్థుఁడఁ గాను

(॥కమ॥)
దేవ మీభక్తుఁడననే తేజ మొకటె కాని
చేవమీర నినుఁ బూజించ నేరను
శ్రీవేంకటేశ నీచేతిలోనివాఁడ నేను
భావించి మఱి యేపాపము నెఱఁగను

(||pallavi||)
kamalāramaṇa nīgalbidabumānisini
tamidoḍa nādikku dayam̐ jūḍave

(||kama||)
ārīdi brāhmaṇum̐ḍa nanuḍegāni dehamu
kori yāsāramunagum̐ gŏlubadu
peru vaiṣhṇavum̐ḍanane pĕddarigame kāni
sāramaina manasulo jñāname ledu

(||kama||)
sadividinaniyĕḍi salabāda miṁte kāni
adana naṁduloni ‌ardha mĕṟam̐ga
padirisaṁsāramane bahurūbame kāni
sadurum̐danāna naṁdu samardhum̐ḍam̐ gānu

(||kama||)
deva mībhaktum̐ḍanane teja mŏgaḍĕ kāni
sevamīra ninum̐ būjiṁcha neranu
śhrīveṁkaḍeśha nīsedilonivām̐ḍa nenu
bhāviṁchi maṟi yebābamu nĕṟam̐ganu