Kallari vaunanaraadu kaadanaraadu

కల్లరి వౌననరాదు కాదనరాదు
Language

(॥పల్లవి॥)
కల్లరి వౌననరాదు కాదనరాదు
చెల్లు నీవు సేసినట్టి చేఁతలెల్లా నిపుడు

(॥కల్లరి॥)
తలఁపులో నొకటియు తనువుపై నొకటియు
కలదెల్ల నీ వల్లఁ గంటిమి నేఁడు
నలువంక సన్నలును నామీఁది మన్ననలు
పలుమారు నిందరిలోఁ బచ్చిదేరే నిపుడు

(॥కల్లరి॥)
చెప్పేటి దొకటియు సేసేటిదొకటియు
దెప్పరాన నీ సుద్దులు తెలిసితిమి
తప్పుఁబేరి పిలుపులు తగ నాపై వలపులు
విప్పుగా నీవోజ వెల్లావిరులాయ నిపుడు

(॥కల్లరి॥)
కొలువులో నొకటియుఁ గూటమిలో నొకటియు
యెలమి నీగుణమెల్లా నెరిఁగితిమి
అలమేలుమంగను నేనని శ్రీవేంకటేశుఁడ
కలసితి నీవలపు గట్టియాయ నిపుడు

(||pallavi||)
kallari vaunanarādu kādanarādu
sĕllu nīvu sesinaṭṭi sem̐talĕllā nibuḍu

(||kallari||)
talam̐pulo nŏgaḍiyu tanuvubai nŏgaḍiyu
kaladĕlla nī vallam̐ gaṁṭimi nem̐ḍu
naluvaṁka sannalunu nāmīm̐di mannanalu
palumāru niṁdarilom̐ bachchidere nibuḍu

(||kallari||)
sĕppeḍi dŏgaḍiyu seseḍidŏgaḍiyu
dĕpparāna nī suddulu tĕlisidimi
tappum̐beri pilubulu taga nābai valabulu
vippugā nīvoja vĕllāvirulāya nibuḍu

(||kallari||)
kŏluvulo nŏgaḍiyum̐ gūḍamilo nŏgaḍiyu
yĕlami nīguṇamĕllā nĕrim̐gidimi
alamelumaṁganu nenani śhrīveṁkaḍeśhum̐ḍa
kalasidi nīvalabu gaṭṭiyāya nibuḍu