(॥పల్లవి॥)
కల్లమాడ దొడ్డముద్ర కటకటా
చెల్లుబడి కల్లలు చెప్పేరు లోకులు
(॥కల్ల॥)
యిప్పుడేలే బ్రహ్మదేవుఁడిట్టే వుండఁగ మీఁదటి-
వొప్పగు బ్రహ్మపట్టము వొకరికి వెచ్చపెట్టి
అప్పటి మూఁడుమూర్తులయందులో నీతని సరి-
చెప్పఁబొయ్యే రీమాట చెల్లునా లోకులకు
(॥కల్ల॥)
కైలాసము రుద్రుఁడుగల బ్రహ్మాండకోట్లు
పోలించి విష్ణుఁడు కడుపున నించుకుండఁగాను
చాలి మూఁడుమూర్తులలో సరి యీతఁ డంటాను
కూళలై యాడేరు గాక కూడునా లోకులకు
(॥కల్ల॥)
ఘనుఁ డీతనిపాదము గడిగె బ్రహ్మదేవుఁడు
మునుముట్టి శిరసున మోఁచె శివుఁడు
వొనర మూఁడుమూర్తులం దొకఁడు శ్రీవేంకటేశుఁ-
డనుమాట యిది తగవవునా లోకులకు
(||pallavi||)
kallamāḍa dŏḍḍamudra kaḍagaḍā
sĕllubaḍi kallalu sĕpperu logulu
(||kalla||)
yippuḍele brahmadevum̐ḍiṭṭe vuṁḍam̐ga mīm̐daḍi-
vŏppagu brahmabaṭṭamu vŏgarigi vĕchchabĕṭṭi
appaḍi mūm̐ḍumūrdulayaṁdulo nīdani sari-
sĕppam̐bŏyye rīmāḍa sĕllunā logulagu
(||kalla||)
kailāsamu rudrum̐ḍugala brahmāṁḍagoṭlu
poliṁchi viṣhṇum̐ḍu kaḍubuna niṁchuguṁḍam̐gānu
sāli mūm̐ḍumūrdulalo sari yīdam̐ ḍaṁṭānu
kūḽalai yāḍeru gāga kūḍunā logulagu
(||kalla||)
ghanum̐ ḍīdanibādamu gaḍigĕ brahmadevum̐ḍu
munumuṭṭi śhirasuna mom̐sĕ śhivum̐ḍu
vŏnara mūm̐ḍumūrdulaṁ dŏgam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍanumāḍa yidi tagavavunā logulagu