కల్లలాడేదానఁ గాను కలది కలట్టే కాని
(॥పల్లవి॥)
కల్లలాడేదానఁ గాను కలది కలట్టే కాని
మెల్లనే యిందుకుఁగా నామీఁదఁ గోపగించేవా
(॥కల్ల॥)
చిన్నఁబోయి వున్నాఁడవు చేరి నే మాటాడఁగ
నిన్ను నాపె మీరెనట నిజమా యిది
యెన్ని నాతో యలుకని యెరఁగనవా రాడేరు
నిన్నటినామాటలకు నీ వెగ్గు వట్టేవా
(॥కల్ల॥)
తలపొసి చింతించేవు దైవార నే నవ్వ గాను
అలమా పెగొరనొ త్తి నందుకా యిది
చలమిది నా తోనని సంగడి వారే రెంచేరు
కలగనినే జెప్పినకత కింత సేసేవా
(॥కల్ల॥)
సిగ్గుపడి వున్నాఁడవు చేరి నిన్నుఁ గూడఁగ
తగ్గి యాపె వరసలు తప్పెనంటా నా
నిగ్గుల శ్రీవేంకటేశ నిన్ను నేనే కూడితిని
కగ్గక నావిన్నపాలు కాదుగూడ దనేవా
(||pallavi||)
kallalāḍedānam̐ gānu kaladi kalaṭṭe kāni
mĕllane yiṁdugum̐gā nāmīm̐dam̐ gobagiṁchevā
(||kalla||)
sinnam̐boyi vunnām̐ḍavu seri ne māḍāḍam̐ga
ninnu nābĕ mīrĕnaḍa nijamā yidi
yĕnni nādo yalugani yĕram̐ganavā rāḍeru
ninnaḍināmāḍalagu nī vĕggu vaṭṭevā
(||kalla||)
talabŏsi siṁtiṁchevu daivāra ne navva gānu
alamā pĕgŏranŏ tti naṁdugā yidi
salamidi nā tonani saṁgaḍi vāre rĕṁcheru
kalaganine jĕppinagada kiṁta sesevā
(||kalla||)
siggubaḍi vunnām̐ḍavu seri ninnum̐ gūḍam̐ga
taggi yābĕ varasalu tappĕnaṁṭā nā
niggula śhrīveṁkaḍeśha ninnu nene kūḍidini
kaggaga nāvinnabālu kādugūḍa danevā