Kallalaadagumee maadaa kaddo ledo

కల్లలాడకుమీ మాటా కద్దో లేదో
Language

(॥పల్లవి॥)
కల్లలాడకుమీ మాటా కద్దో లేదో
యెల్లవారిలో మా దిక్కు యేమి చూచేవయ్యా

(॥కల్ల॥)
సలిగె గద్దంటానాపె సారె నిన్నుఁ దిట్టెఁగాక
అలసి సొలసినా నే మంత సేసేమా
నెలకొని నీమన్ననే నీకుఁ బైకొని వచ్చె
యెలమిఁ దప్పక మమ్ము యేమి చూచేవయ్యా

(॥కల్ల॥)
బాసగొంటినంటా నాపె బలుములు చూపెఁగాక
వేసరించినా నీతో వెగ్గళించేమా
ఆసల నీతమకమే అంతఱట్టుగాఁజేసె
యేసచూపులను మమ్మునేమి చూచేవయ్యా

(॥కల్ల॥)
పట్టుపుదేవులనంటా భామ నిన్నుఁ గూడెఁగాక
యెట్టు నీవు గూడినాను ఇదేలనేమా
గుట్టున శ్రీ వేంకటాద్రి గోవిందుఁడ మమ్మేలితిఁ
విట్టె నవ్వుతా మమ్మునేమి చూచేవయ్యా

(||pallavi||)
kallalāḍagumī māḍā kaddo ledo
yĕllavārilo mā dikku yemi sūsevayyā

(||kalla||)
saligĕ gaddaṁṭānābĕ sārĕ ninnum̐ diṭṭĕm̐gāga
alasi sŏlasinā ne maṁta sesemā
nĕlagŏni nīmannane nīgum̐ baigŏni vachchĕ
yĕlamim̐ dappaga mammu yemi sūsevayyā

(||kalla||)
bāsagŏṁṭinaṁṭā nābĕ balumulu sūbĕm̐gāga
vesariṁchinā nīdo vĕggaḽiṁchemā
āsala nīdamagame aṁtaṟaṭṭugām̐jesĕ
yesasūbulanu mammunemi sūsevayyā

(||kalla||)
paṭṭubudevulanaṁṭā bhāma ninnum̐ gūḍĕm̐gāga
yĕṭṭu nīvu gūḍinānu idelanemā
guṭṭuna śhrī veṁkaḍādri goviṁdum̐ḍa mammelidim̐
viṭṭĕ navvudā mammunemi sūsevayyā