Kallagaadu yidi neevu gannabane

కల్లగాదు యిది నీవు గన్నపనే
Language

(॥పల్లవి॥)
కల్లగాదు యిది నీవు గన్నపనే
చెల్లు నీకే యన్నియును చిత్తగించరాదా

(॥కల్ల॥)
మొక్కిననా మొక్కులోనే మోహమెల్లాఁ గానరాదా
చొక్కపునామనసేమి సోదించేవు
యిక్కడనే భ్రమయించ యిదిగొంత వలెనా
తక్కరితనము నేర దయఁజూడు మిఁకను

(॥కల్ల॥)
యిచ్చినకానికెలోనే యితవెల్లాఁ దెలియదా
తచ్చి, మాగుణములేమి తలపోసేవు
రచ్చఁబెట్టి నీవింత రవ్వసేయవలెనా
మచ్చరఁమెఱఁగ నన్ను మన్నించు మిఁకను

(॥కల్ల॥)
కూడిన నాకూటమిలో గుణమెల్లఁ గానరాదా
తోడనే మమ్మెంత నీవు తొరలించేవు
వేడుక మించితివి శ్రీవేంకటేశ నన్ను నిట్టె
జాడ నలమేల్మంగను చనవులి మ్మిఁకను

(||pallavi||)
kallagādu yidi nīvu gannabane
sĕllu nīge yanniyunu sittagiṁcharādā

(||kalla||)
mŏkkinanā mŏkkulone mohamĕllām̐ gānarādā
sŏkkabunāmanasemi sodiṁchevu
yikkaḍane bhramayiṁcha yidigŏṁta valĕnā
takkaridanamu nera dayam̐jūḍu mim̐kanu

(||kalla||)
yichchinagānigĕlone yidavĕllām̐ dĕliyadā
tachchi, māguṇamulemi talabosevu
rachcham̐bĕṭṭi nīviṁta ravvaseyavalĕnā
machcharam̐mĕṟam̐ga nannu manniṁchu mim̐kanu

(||kalla||)
kūḍina nāgūḍamilo guṇamĕllam̐ gānarādā
toḍane mammĕṁta nīvu tŏraliṁchevu
veḍuga miṁchidivi śhrīveṁkaḍeśha nannu niṭṭĕ
jāḍa nalamelmaṁganu sanavuli mmim̐kanu