కల్లగాదు చూడవయ్య కన్నులెదుటనే యిదె
(॥పల్లవి॥)
కల్లగాదు చూడవయ్య కన్నులెదుటనే యిదె
జల్లన మైపులకల జాజులు పైఁ బోసెను
(॥కల్ల॥)
చెప్పేటి నీగుణములు చెవియొగ్గి మాచెలి
కప్పురవునవ్వులనే కానుకవట్టె
వొప్పులుగ నీవిట్టే తనవొద్దికి వచ్చేవంటే
కప్పినతనచన్నులు కప్పముగాఁ బట్టెను
(॥కల్ల॥)
యివ్వల విడెము నీకు యిట్టె యిమ్మనేనంటే
వువ్విళ్ళూరఁ దనమోవి వులుపా వట్టె
దవ్వులనే వలపులు తతి నీపైఁ జల్లేనంటే
సువ్వనఁ జేతిమొక్కులు సూడిదెగాఁ బట్టె
(॥కల్ల॥)
నెమ్మది నీవు సరుస నిలుచున్నాఁడవంటే
కొమ్మ నీబంగారపు కొంగు వట్టెను
యిమ్ముల శ్రీవేంకటేశ యిదె నీవు గూడఁగాను
పమ్మి నీకాఁగిలి మరి బారచాఁచి పట్టెను
(||pallavi||)
kallagādu sūḍavayya kannulĕduḍane yidĕ
jallana maibulagala jājulu paim̐ bosĕnu
(||kalla||)
sĕppeḍi nīguṇamulu sĕviyŏggi māsĕli
kappuravunavvulane kānugavaṭṭĕ
vŏppuluga nīviṭṭe tanavŏddigi vachchevaṁṭe
kappinadanasannulu kappamugām̐ baṭṭĕnu
(||kalla||)
yivvala viḍĕmu nīgu yiṭṭĕ yimmanenaṁṭe
vuvviḽḽūram̐ danamovi vulubā vaṭṭĕ
davvulane valabulu tadi nībaim̐ jallenaṁṭe
suvvanam̐ jedimŏkkulu sūḍidĕgām̐ baṭṭĕ
(||kalla||)
nĕmmadi nīvu sarusa nilusunnām̐ḍavaṁṭe
kŏmma nībaṁgārabu kŏṁgu vaṭṭĕnu
yimmula śhrīveṁkaḍeśha yidĕ nīvu gūḍam̐gānu
pammi nīgām̐gili mari bārasām̐si paṭṭĕnu