Kallagaadu neevu maagum galidem jaalu

కల్లగాదు నీవు మాకుఁ గలితేఁ జాలు
Language

(॥పల్లవి॥)
కల్లగాదు నీవు మాకుఁ గలితేఁ జాలు
తొల్లిటి ఇంతినే యింకాఁ దోడుక వచ్చేను

(॥కల్ల॥)
తగిలి నీవెదుటను తలవంచుకుండఁగాను
నగితేను మొగమెత్తి నన్నుఁ జూచేవు
మగువ నెవ్వతె నీవు మనసునఁ దలఁచేవో
బెగడకావతీవయ్య పిలిచి తెచ్చేను

(॥కల్ల॥)
యెక్కడికో నీ విప్పుడెదురులు చూడఁగాను
మొక్కితే వేఁడుకొని నా చెక్కునొక్కేవు
అక్కడ నెవ్వతెమీఁది ఆస నీకు నున్నదో
తక్కకానతీవయ్య దండకుఁ దెచ్చేను

(॥కల్ల॥)
యెందుకో నీపాయము మీఁదెత్తుకొని వుండఁగాను
అంది నిన్నుఁ గూడితే నన్నాదరించేవు
ముందు శ్రీవేంకటేశ నీ మోహమెందు నుండునో
యిందే ఆనతీవయ్యా యింటికిఁ దెచ్చేను

(||pallavi||)
kallagādu nīvu māgum̐ galidem̐ jālu
tŏlliḍi iṁtine yiṁkām̐ doḍuga vachchenu

(||kalla||)
tagili nīvĕduḍanu talavaṁchuguṁḍam̐gānu
nagidenu mŏgamĕtti nannum̐ jūsevu
maguva nĕvvadĕ nīvu manasunam̐ dalam̐sevo
bĕgaḍagāvadīvayya pilisi tĕchchenu

(||kalla||)
yĕkkaḍigo nī vippuḍĕdurulu sūḍam̐gānu
mŏkkide vem̐ḍugŏni nā sĕkkunŏkkevu
akkaḍa nĕvvadĕmīm̐di āsa nīgu nunnado
takkagānadīvayya daṁḍagum̐ dĕchchenu

(||kalla||)
yĕṁdugo nībāyamu mīm̐dĕttugŏni vuṁḍam̐gānu
aṁdi ninnum̐ gūḍide nannādariṁchevu
muṁdu śhrīveṁkaḍeśha nī mohamĕṁdu nuṁḍuno
yiṁde ānadīvayyā yiṁṭigim̐ dĕchchenu