కలిమి నిందరిని దగ్గరుకొరకే
(॥పల్లవి॥)
కలిమి నిందరిని దగ్గరుకొరకే - వీఁడె
సులభుఁడై తిరిగీని చూడరమ్మా
(॥కలిమి॥)
భంగపెట్టి గొల్లవారి పాలువెన్నలు
దొంగిలించు కొరకే తోవలనెల్లా
చెంగలించి చేతులెత్తి చెలఁగుచును- వీఁడె
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా
(॥కలిమి॥)
గుట్టుదీర రేపల్లెకొమ్మలనెల్లా
రట్టుసేయుకొరకే రచ్చలనెల్ల
గట్టిగాఁ జాటెడి మొలగంటలతోడ- వీఁడె
చుట్టపుబాలునివలెఁ జూడరమ్మా
(॥కలిమి॥)
చెప్పరాని తనమాయచేత నిందరినిఁ
గప్పెడికొరకే వేంకటవిభుఁడు
కప్పెడి నల్లనియలకలనుదురు-వీఁడె
గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా
(||pallavi||)
kalimi niṁdarini daggarugŏrage - vīm̐ḍĕ
sulabhum̐ḍai tirigīni sūḍarammā
(||kalimi||)
bhaṁgabĕṭṭi gŏllavāri pāluvĕnnalu
dŏṁgiliṁchu kŏrage tovalanĕllā
sĕṁgaliṁchi sedulĕtti sĕlam̐gusunu- vīm̐ḍĕ
dŏṁgi dŏṁgi tirigīni tolarammā
(||kalimi||)
guṭṭudīra reballĕgŏmmalanĕllā
raṭṭuseyugŏrage rachchalanĕlla
gaṭṭigām̐ jāḍĕḍi mŏlagaṁṭaladoḍa- vīm̐ḍĕ
suṭṭabubālunivalĕm̐ jūḍarammā
(||kalimi||)
sĕpparāni tanamāyaseda niṁdarinim̐
gappĕḍigŏrage veṁkaḍavibhum̐ḍu
kappĕḍi nallaniyalagalanuduru-vīm̐ḍĕ
guppĕḍi muddulu yĕttugŏnarammā