కలిగినట్టు చెప్పమీ కల్లలాడక నీవు
(॥పల్లవి॥)
కలిగినట్టు చెప్పమీ కల్లలాడక నీవు
వలతునంటాఁ జెప్పేవు వడిగా నాతోను
(॥కలి॥)
తలఁపులోఁ బారువా తప్పక నారూపము
పిలువఁగ నోరికి నా పేరు వచ్చునా
కలలోన నీవు నన్ను కాఁగిలించి కొన్నట్టేనా
చెలులతో నాగుణాలు చెప్పి పొగడుదువా
(॥కలి॥)
మనసు గరఁగునా(నా) మాటలు వింటే నీకు
తనువు సోఁకించితేను తమి రేఁగునా
ననిచి నాచెలిఁ గంటే నంటు సేతునా నీవు
కొనబైన నారాక కోరుదువా యెపుడు
(॥కలి॥)
సూటిగా నాయింటివంక చూచితే వేడుకలౌనా
యీటున నేఁ బేనఁగితే ఇచ్చకమౌనా
గాఁటపు శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
మేటి నావినయాలకు మెత్తువా నీవు
(||pallavi||)
kaliginaṭṭu sĕppamī kallalāḍaga nīvu
valadunaṁṭām̐ jĕppevu vaḍigā nādonu
(||kali||)
talam̐pulom̐ bāruvā tappaga nārūbamu
piluvam̐ga norigi nā peru vachchunā
kalalona nīvu nannu kām̐giliṁchi kŏnnaṭṭenā
sĕlulado nāguṇālu sĕppi pŏgaḍuduvā
(||kali||)
manasu garam̐gunā(nā) māḍalu viṁṭe nīgu
tanuvu som̐kiṁchidenu tami rem̐gunā
nanisi nāsĕlim̐ gaṁṭe naṁṭu sedunā nīvu
kŏnabaina nārāga koruduvā yĕbuḍu
(||kali||)
sūḍigā nāyiṁṭivaṁka sūside veḍugalaunā
yīḍuna nem̐ benam̐gide ichchagamaunā
gām̐ṭabu śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
meḍi nāvinayālagu mĕttuvā nīvu