Kaliginanaamde suttarigambulam dirugu nivi

కలిగిననాఁడే చుట్టరికంబులఁ దిరుగు నివి
Language

(॥పల్లవి॥)
కలిగిననాఁడే చుట్టరికంబులఁ దిరుగు నివి
నలుగడ నివి సతమని మతి నమ్ముట పాపమయా

(॥కలి॥)
దేహము తోడనె పెరుగును తీరని యీ‌ఇంద్రియములు
దేహము తోడనె ముదియును తేటతెల్లమిగను
ఆ పుట్టనినాఁడును అంతము నొందిననాఁడును
శ్రీహరిమాయలఁ దగులుక జీవునిఁ దడవ వివి

(॥కలి॥)
తెలిశున్నపడే తగులును తియ్యని యీ సంసారము
తెలివికిఁ బాసినయప్పుడు దిగఁబడుఁ దా నెందో
మలయక నిద్రించునప్పుడు మత్తుఁడై యున్నప్పుడు
చలమరి జీవుని తోడుత సమ్మతమే లేదు

(॥కలి॥)
కన్నులు దెరచిన యప్పుడే కాన్పించును యీలోకము
కన్నులు మూసినయప్పుడె కడగడఁ దా నణగు
అన్నిట శ్రీవేంకటేశ్వరుఁ డాత్మను వెలిఁగెడివేళను
వున్నతి జీవులఁ దగులవు వొదుగుచుఁ దిరుగు నివి

(||pallavi||)
kaliginanām̐ḍe suṭṭarigaṁbulam̐ dirugu nivi
nalugaḍa nivi sadamani madi nammuḍa pābamayā

(||kali||)
dehamu toḍanĕ pĕrugunu tīrani yī‌iṁdriyamulu
dehamu toḍanĕ mudiyunu teḍadĕllamiganu
ā puṭṭaninām̐ḍunu aṁtamu nŏṁdinanām̐ḍunu
śhrīharimāyalam̐ daguluga jīvunim̐ daḍava vivi

(||kali||)
tĕliśhunnabaḍe tagulunu tiyyani yī saṁsāramu
tĕlivigim̐ bāsinayappuḍu digam̐baḍum̐ dā nĕṁdo
malayaga nidriṁchunappuḍu mattum̐ḍai yunnappuḍu
salamari jīvuni toḍuda sammadame ledu

(||kali||)
kannulu dĕrasina yappuḍe kānpiṁchunu yīlogamu
kannulu mūsinayappuḍĕ kaḍagaḍam̐ dā naṇagu
anniḍa śhrīveṁkaḍeśhvarum̐ ḍātmanu vĕlim̐gĕḍiveḽanu
vunnadi jīvulam̐ dagulavu vŏdugusum̐ dirugu nivi