Kaligi silugala koligi neegu nemu

కలికి చిలుకల కొలికి నీకు నేము
Language

(॥పల్లవి॥)
కలికి చిలుకల కొలికి నీకు నేము
చెలులము సంతోసము చేసితివే మాకు

(॥కలికి॥)
అవ్వలిమోమైనవాని ఆయములు సోఁకనాడి
యివ్వల చేకొంటివిదివో నేర్పు
పవ్వళించి సతులపై పరాకై వుండినవేళ
నవ్వులు నవ్వించితివి నయగారివౌదువే

(॥కలికి॥)
పంతములాడినవాని పానుపుమీఁదికి నేఁడు
యింతగా రప్పించుకొంటివిదివోనేర్పు
చెంతల నవ్వఁగా నన్నుచేరి జూజమాడేవేళ
వింతరతికిఁ దీసితి వివరి వొదువే

(॥కలికి॥)
సన్నలు సేసినవాని చాయఁ బైఁదీసుకొని
యెన్నిక చేకొంటివిదివో నేర్పు
అన్నిటా శ్రీ వెంకటేశుఁడాతఁడు చేకొన్నవేళ
మన్ననల మించితివి మంచిదానవౌదువే

(||pallavi||)
kaligi silugala kŏligi nīgu nemu
sĕlulamu saṁtosamu sesidive māgu

(||kaligi||)
avvalimomainavāni āyamulu som̐kanāḍi
yivvala segŏṁṭividivo nerbu
pavvaḽiṁchi sadulabai parāgai vuṁḍinaveḽa
navvulu navviṁchidivi nayagārivauduve

(||kaligi||)
paṁtamulāḍinavāni pānubumīm̐digi nem̐ḍu
yiṁtagā rappiṁchugŏṁṭividivonerbu
sĕṁtala navvam̐gā nannuseri jūjamāḍeveḽa
viṁtaradigim̐ dīsidi vivari vŏduve

(||kaligi||)
sannalu sesinavāni sāyam̐ baim̐dīsugŏni
yĕnniga segŏṁṭividivo nerbu
anniḍā śhrī vĕṁkaḍeśhum̐ḍādam̐ḍu segŏnnaveḽa
mannanala miṁchidivi maṁchidānavauduve