Kaligi ni nnidu sooseem gamtivaa voyi

కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి
Language

(॥పల్లవి॥)
కలికి ని న్నిటు చూచీఁ గంటివా వోయి
తలపోసితే నీకు తరితీపు వంటిది

(॥కలి॥)
ఆసతోఁ జూచినచూపు యంటుబచ్చలివంటిది
పాసికూడినచూపు పండువంటిది
లాసి లాసి చూచే చూపు లాగవేగము వంటిది
సేసవెట్టి చూచేచూపు చిగిరింపువంటిది

(॥కలి॥)
అల్లార్చి చూచినచూపు అట్టె గాలమువంటిది
చల్లుఁజూప కవ్రపువాసనవంటిది
చిల్లరనాఁటుఁజూపులు చిమ్ముఁదేనెలువంటివి
వెల్లవిరిఁ జూచేచూపు విడుగూళ్ళువంటివి

(॥కలి॥)
మునుకొని చూచేచూపు మోహపుమొక్కువంటిది
వినయపుఁ జూప మోవివిందువంటిది
యెనసె శ్రీవేంకటేవ యిన్నిటాను నిన్ను నీకె
తనసిన నాచూపు తారుకాణవంటిది

(||pallavi||)
kaligi ni nniḍu sūsīm̐ gaṁṭivā voyi
talaboside nīgu taridību vaṁṭidi

(||kali||)
āsadom̐ jūsinasūbu yaṁṭubachchalivaṁṭidi
pāsigūḍinasūbu paṁḍuvaṁṭidi
lāsi lāsi sūse sūbu lāgavegamu vaṁṭidi
sesavĕṭṭi sūsesūbu sigiriṁpuvaṁṭidi

(||kali||)
allārsi sūsinasūbu aṭṭĕ gālamuvaṁṭidi
sallum̐jūba kavrabuvāsanavaṁṭidi
sillaranām̐ṭum̐jūbulu simmum̐denĕluvaṁṭivi
vĕllavirim̐ jūsesūbu viḍugūḽḽuvaṁṭivi

(||kali||)
munugŏni sūsesūbu mohabumŏkkuvaṁṭidi
vinayabum̐ jūba moviviṁduvaṁṭidi
yĕnasĕ śhrīveṁkaḍeva yinniḍānu ninnu nīgĕ
tanasina nāsūbu tārugāṇavaṁṭidi