Kaligi neeyeduda nive kaanugalu vatteeni

కలికి నీయెదుట నివె కానుకలు వట్టీని
Language

(॥పల్లవి॥)
కలికి నీయెదుట నివె కానుకలు వట్టీని
యెలమి నేఁడిఁక నీకు నింపవునో కావో

(॥కలికి॥)
కప్పురములో పిసరు కాంతనవ్వుల కొసరు
చిప్పిలుఁ దేనెల వెగటు చెమట సొగటు
ముప్పిరిఁ బన్నీటి జాలు మొదల వలచిన మేలు
యిప్పుడు నీకివియెల్ల నితవౌనో కావో

(॥కలికి॥)
పొగరు వెన్నెలవేఁడి పొలఁతి చూపులవాఁడి
చిగురు గుత్తుల మినుకు చేతిచెనకు
వొగరు వీడెపు మదము వుబ్బరి చిత్తపుమదము
బిగియ నేఁటికి నీకుఁ బ్రియమౌనో కాదో

(॥కలికి॥)
విరుల దొంతరసరులు వెలఁది చనుఁగవ గురులు
సరిఁ జెఱకువిలు బలుపు సకియనిలుపు
గరిమ శ్రీ వేంకటేశ కలసితివి యీసతిని
సరసములు దొరకె నివి చవులౌనో కాదో

(||pallavi||)
kaligi nīyĕduḍa nivĕ kānugalu vaṭṭīni
yĕlami nem̐ḍim̐ka nīgu niṁpavuno kāvo

(||kaligi||)
kappuramulo pisaru kāṁtanavvula kŏsaru
sippilum̐ denĕla vĕgaḍu sĕmaḍa sŏgaḍu
muppirim̐ bannīḍi jālu mŏdala valasina melu
yippuḍu nīgiviyĕlla nidavauno kāvo

(||kaligi||)
pŏgaru vĕnnĕlavem̐ḍi pŏlam̐ti sūbulavām̐ḍi
siguru guttula minugu sedisĕnagu
vŏgaru vīḍĕbu madamu vubbari sittabumadamu
bigiya nem̐ṭigi nīgum̐ briyamauno kādo

(||kaligi||)
virula dŏṁtarasarulu vĕlam̐di sanum̐gava gurulu
sarim̐ jĕṟaguvilu balubu sagiyanilubu
garima śhrī veṁkaḍeśha kalasidivi yīsadini
sarasamulu dŏragĕ nivi savulauno kādo