Kaligi adivo kannu giṟibeeni

కలికి అదివో కన్ను గిఱిపీని
Language

(॥పల్లవి॥)
కలికి అదివో కన్ను గిఱిపీని
పొలుపు తామెరలచే పూజ సేసినట్లు

(॥కలికి॥)
యేమి గావలెనో కాని యింతి తనచెలులకు
వేమారు నిన్నుఁ దనవేలఁ జూపీని
కాముని యమ్ములకు చక్కని గుఱి నీ వని
చూమరల నిందరికీఁ జూపీ చెప్పినట్లు

(॥కలికి॥)
యెంత పనికో కాని యిటు నిన్ను రమ్మని
సంతసాన తనచేత సన్న సేసేని
యింతలోనే తాను నీ యౌవనరాజ్య మెల్ల
రంతులోఁ జిగురున తోరణకట్టినట్లు

(॥కలికి॥)
యీవేళఁ గూడినందుల కిటు ని న్నాకి మెచ్చి
శ్రీవేంకటేశ నీ చెక్కు నొక్కీని
కోవిలకూఁతలు నీకుత్తి కెలో కులుకఁగాను
యేవిధి మానుప రాక యిటు సేసి నట్లు

(||pallavi||)
kaligi adivo kannu giṟibīni
pŏlubu tāmĕralase pūja sesinaṭlu

(||kaligi||)
yemi gāvalĕno kāni yiṁti tanasĕlulagu
vemāru ninnum̐ danavelam̐ jūbīni
kāmuni yammulagu sakkani guṟi nī vani
sūmarala niṁdarigīm̐ jūbī sĕppinaṭlu

(||kaligi||)
yĕṁta panigo kāni yiḍu ninnu rammani
saṁtasāna tanaseda sanna seseni
yiṁtalone tānu nī yauvanarājya mĕlla
raṁtulom̐ jiguruna toraṇagaṭṭinaṭlu

(||kaligi||)
yīveḽam̐ gūḍinaṁdula kiḍu ni nnāgi mĕchchi
śhrīveṁkaḍeśha nī sĕkku nŏkkīni
kovilagūm̐talu nīgutti kĕlo kulugam̐gānu
yevidhi mānuba rāga yiḍu sesi naṭlu