కలిగెను నీవల్లఁ గంటి మీ వలపు
(॥పల్లవి॥)
కలిగెను నీవల్లఁ గంటి మీ వలపు
అలరి చెప్పఁ గతలాయను వలపు
(॥కలి॥)
పలువురు సొలయక పంతము నెరపక
అలుగక వుండిన దది వలపు
చలములు వెంచక సడఁగులు రాల్చక
కలసి మెలఁగుటే కందువ వలపు
(॥కలి॥)
వెంగెము లాడక వేసాల బొరలక
అంగము చూపని దది వలపు
చెంగక యేపొద్దు సిగ్గున లోఁగక
సంగడి నుండుటే సతమగు వలపు
(॥కలి॥)
తగవులు దప్పక తలఁపున మరవక
అగడులు సేయని దది వలపు
జిగి నినుఁ గూడెను శ్రీవేంకటేశుఁడు
మగువ నీకడరె మంచిది వలపు
(||pallavi||)
kaligĕnu nīvallam̐ gaṁṭi mī valabu
alari sĕppam̐ gadalāyanu valabu
(||kali||)
paluvuru sŏlayaga paṁtamu nĕrabaga
alugaga vuṁḍina dadi valabu
salamulu vĕṁchaga saḍam̐gulu rālsaga
kalasi mĕlam̐guḍe kaṁduva valabu
(||kali||)
vĕṁgĕmu lāḍaga vesāla bŏralaga
aṁgamu sūbani dadi valabu
sĕṁgaga yebŏddu sigguna lom̐gaga
saṁgaḍi nuṁḍuḍe sadamagu valabu
(||kali||)
tagavulu dappaga talam̐puna maravaga
agaḍulu seyani dadi valabu
jigi ninum̐ gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍu
maguva nīgaḍarĕ maṁchidi valabu