కలిగె నీకు నేఁడు కాంత రతివేళను
(॥పల్లవి॥)
కలిగె నీకు నేఁడు కాంత రతివేళను
అలపు మీరఁగ నిట్టె యవధరించవయ్యా
(॥కలి॥)
పడఁతి చెమట నీకు పన్నీటి జలకాలు
తడియొత్తు లాపె యందపు గుబ్బలు
జడిగొను మేని వాసనలు పరిమళాలు
చిడుముడి సిగ్గులే చీనాంబరములు
(॥కలి॥)
అంగన నిట్టూరులే యాలవట్టములు నీకు
రంగగు మాఁటలే కప్పురపుఁ బల్కులు
పొంగారు మోవితేనెలే పొత్తు గూడిన బోనాలు
చెంగటి తమ్ములములే చేకొన్న విడేలు
(॥కలి॥)
కొమ్మ కాఁగిలే నీకు కుందనపుఁ బెను మేడ
చిమ్ము గోరి తాఁకులే మించిన సొమ్ములు
ఇమ్ముల శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
నెమ్మది మీ వలపులే నిండు నిధానములు
(||pallavi||)
kaligĕ nīgu nem̐ḍu kāṁta radiveḽanu
alabu mīram̐ga niṭṭĕ yavadhariṁchavayyā
(||kali||)
paḍam̐ti sĕmaḍa nīgu pannīḍi jalagālu
taḍiyŏttu lābĕ yaṁdabu gubbalu
jaḍigŏnu meni vāsanalu parimaḽālu
siḍumuḍi siggule sīnāṁbaramulu
(||kali||)
aṁgana niṭṭūrule yālavaṭṭamulu nīgu
raṁgagu mām̐ṭale kappurabum̐ balgulu
pŏṁgāru movidenĕle pŏttu gūḍina bonālu
sĕṁgaḍi tammulamule segŏnna viḍelu
(||kali||)
kŏmma kām̐gile nīgu kuṁdanabum̐ bĕnu meḍa
simmu gori tām̐kule miṁchina sŏmmulu
immula śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
nĕmmadi mī valabule niṁḍu nidhānamulu