Kalidoshamulaala kadu nela meereru

కలిదోషములాల కడు నేల మీరేరు
Language

(॥పల్లవి॥)
కలిదోషములాల కడు నేల మీరేరు
యిలధరుఁ డుండగాను యిఁకనేఁటి సుద్దులు

(॥కలి॥)
జగములేలెడువాఁడు సర్వాంతరాత్ముఁడు
జిగి నింక నీకీబుద్ధి చెప్పనోపఁడా
నిగిడి పుట్టించేటివాఁడు నిండుక వుండేటివాఁడు
తెగని కర్మములెల్ల తిద్దకేల మానును

(॥కలి॥)
దనుజులఁ గొట్టేవాఁడు ధర్మము నిలిపేవాఁడు
పనిగొన్న దురితాలు పాపనేరఁడా
కొనమొదలైనవాఁడు గురి దానైనవాడు
వునికి మనికి సేయకూరకుండీనా

(॥కలి॥)
స్వతంత్రుడైనవాఁడు స్వామియైనవాఁడు
గతియై దాసులనెల్లఁ గానకుండీనా
యితఁడే శ్రీవేంకటేశుఁ డిందిరాపతైనవాఁడు
సతతము మాకు నిట్టే సంపద లొసఁగఁడా

(||pallavi||)
kalidoṣhamulāla kaḍu nela mīreru
yiladharum̐ ḍuṁḍagānu yim̐kanem̐ṭi suddulu

(||kali||)
jagamulelĕḍuvām̐ḍu sarvāṁtarātmum̐ḍu
jigi niṁka nīgībuddhi sĕppanobam̐ḍā
nigiḍi puṭṭiṁcheḍivām̐ḍu niṁḍuga vuṁḍeḍivām̐ḍu
tĕgani karmamulĕlla tiddagela mānunu

(||kali||)
danujulam̐ gŏṭṭevām̐ḍu dharmamu nilibevām̐ḍu
panigŏnna duridālu pābaneram̐ḍā
kŏnamŏdalainavām̐ḍu guri dānainavāḍu
vunigi manigi seyagūraguṁḍīnā

(||kali||)
svadaṁtruḍainavām̐ḍu svāmiyainavām̐ḍu
gadiyai dāsulanĕllam̐ gānaguṁḍīnā
yidam̐ḍe śhrīveṁkaḍeśhum̐ ḍiṁdirābadainavām̐ḍu
sadatamu māgu niṭṭe saṁpada lŏsam̐gam̐ḍā