కలవి లేనివి గొన్ని గడించుకొందువుగాక
(॥పల్లవి॥)
కలవి లేనివి గొన్ని గడించుకొందువుగాక
పులకించితేనే మేనిపోలికలు దప్పెనా
(॥కల॥)
నిన్ను నవ్వి నీగుణము నే మానిపేనా కొంత
కిన్నేరమీఁటుల గిలిగింతుఁగాక
పన్నినచన్నులమీఁదివయ్యద దొలఁగితేనే
తన్నుఁదానే వాయించేటితానములు దప్పెనా
(॥కల॥)
జాచతనాలాడి నిన్ను జంకించేనా మరి కొంత
వీణెలోనే వివరాలు వెళ్లింతుఁగాక
నాణెము గాఁ జెమరించి నాచీర దడి సితేనే
రాణించి యాళాపనలో రచనలు దప్పెనా
(॥కల॥)
ఆయములంటి నన్ను నణఎచేనా మరి కొంత
కాయపుజంత్రాన సన్న గావింతుగాఁక
చేయారా శ్రీవేంకటేశ చేకూడఁగాఁ జొక్కితేనే
వాయించేటితంత్రులో వరుసలు దప్పెనా
(||pallavi||)
kalavi lenivi gŏnni gaḍiṁchugŏṁduvugāga
pulagiṁchidene meniboligalu dappĕnā
(||kala||)
ninnu navvi nīguṇamu ne mānibenā kŏṁta
kinneramīm̐ṭula giligiṁtum̐gāga
panninasannulamīm̐divayyada dŏlam̐gidene
tannum̐dāne vāyiṁcheḍidānamulu dappĕnā
(||kala||)
jāsadanālāḍi ninnu jaṁkiṁchenā mari kŏṁta
vīṇĕlone vivarālu vĕḽliṁtum̐gāga
nāṇĕmu gām̐ jĕmariṁchi nāsīra daḍi sidene
rāṇiṁchi yāḽābanalo rasanalu dappĕnā
(||kala||)
āyamulaṁṭi nannu naṇæsenā mari kŏṁta
kāyabujaṁtrāna sanna gāviṁtugām̐ka
seyārā śhrīveṁkaḍeśha segūḍam̐gām̐ jŏkkidene
vāyiṁcheḍidaṁtrulo varusalu dappĕnā