(॥పల్లవి॥)
కలసినచోటను కడమేల
పలుకుల నిటు వొడఁబరచఁగరాదా
(॥॥)
యెరవుల మాటలు యెందాఁక నాడేవు
కరుణించవయ్యా కామినిని
తెరమఱఁగేఁటికి తెలిసె నీ మనసు
యిరవగు నీచనవియ్యఁగ రాదా
(॥॥)
యెలయింపులుగా నెందాఁక నవ్వేవు
అలరించవయ్యా అంగనను
పలుసిగ్గులేల పైకొనెఁ దమకము
నిలిచిన నీమేలు నెరపఁగ రాదా
(॥॥)
యిక్కువలు చేత నెందాఁక నంటేవు
చొక్కించవయ్య యీసుదతి నిటు
గక్కన శ్రీవేంకటేశ కూడితి
వొక్కట మన్ననలొసగఁగ రాదా
(||pallavi||)
kalasinasoḍanu kaḍamela
palugula niḍu vŏḍam̐barasam̐garādā
(||||)
yĕravula māḍalu yĕṁdām̐ka nāḍevu
karuṇiṁchavayyā kāminini
tĕramaṟam̐gem̐ṭigi tĕlisĕ nī manasu
yiravagu nīsanaviyyam̐ga rādā
(||||)
yĕlayiṁpulugā nĕṁdām̐ka navvevu
alariṁchavayyā aṁgananu
palusiggulela paigŏnĕm̐ damagamu
nilisina nīmelu nĕrabam̐ga rādā
(||||)
yikkuvalu seda nĕṁdām̐ka naṁṭevu
sŏkkiṁchavayya yīsudadi niḍu
gakkana śhrīveṁkaḍeśha kūḍidi
vŏkkaḍa mannanalŏsagam̐ga rādā