కలసితి మిందరము కాఁగిటిపొత్తు
(॥పల్లవి॥)
కలసితి మిందరము కాఁగిటిపొత్తు
చెలఁగి నీ నేమములు చెప్పనేఁటి కిఁకను
(॥కల॥)
కాంతలందరితోడాను కలయఁగ నవ్వేవు
సంతవావులాయఁగా నీసరసములు
యింతలో నందరిమోవులెంగిలి నేకములాయ
చెంతల నీనేమములు చెప్పనేఁటి కిఁకను
(॥కల॥)
చల్లఁగా నందరితో జూజములు నీ వాడేవు
గొల్లదోమటాయఁగా నీ కోరికలు
కల్లగాదు రతివేల కాఁగిళ్లెల్లా నొక్కటాయ
చిల్లర నీనేమములు చెప్పనేఁటి కింకను
(॥కల॥)
వాడిక నందరి కొక్కవరుసిచ్చి కూడితివి
యీడఁ గలగూరగంపె యెనసెఁ బొందు
తోడనే శ్రీవేంకటేశ దొమ్మేయ మరుతంత్రము
జీడిగా నీనేమములు చెప్పనేఁటి కిఁకను
(||pallavi||)
kalasidi miṁdaramu kām̐giḍibŏttu
sĕlam̐gi nī nemamulu sĕppanem̐ṭi kim̐kanu
(||kala||)
kāṁtalaṁdaridoḍānu kalayam̐ga navvevu
saṁtavāvulāyam̐gā nīsarasamulu
yiṁtalo naṁdarimovulĕṁgili negamulāya
sĕṁtala nīnemamulu sĕppanem̐ṭi kim̐kanu
(||kala||)
sallam̐gā naṁdarido jūjamulu nī vāḍevu
gŏlladomaḍāyam̐gā nī korigalu
kallagādu radivela kām̐giḽlĕllā nŏkkaḍāya
sillara nīnemamulu sĕppanem̐ṭi kiṁkanu
(||kala||)
vāḍiga naṁdari kŏkkavarusichchi kūḍidivi
yīḍam̐ galagūragaṁpĕ yĕnasĕm̐ bŏṁdu
toḍane śhrīveṁkaḍeśha dŏmmeya marudaṁtramu
jīḍigā nīnemamulu sĕppanem̐ṭi kim̐kanu