Kalalona nitlane kaampuramu nitlane

కలలోన నిట్లనే కాఁపురము నిట్లనే
Language

(॥పల్లవి॥)
కలలోన నిట్లనే కాఁపురము నిట్లనే
నిలువు గల్లందమో నిజమందమో

(॥కల॥)
వొక్కనాటి ప్రపంచము వొక్కనాటివలె రాదు
వొక్క నిమిషమువలె నొకటి గాదు
పక్కన మాయమైపోవు బడిబడినే వచ్చు
నెక్కొని కల్లందమో నిజమందమో

(॥కల॥)
పొద్దు వొడచేది గొంత పొద్దు గూఁకేది గొంత
చద్ది గొంత వేఁడి గొంత చవులు గొంత
వొద్దనే కాలమునుండు వుండుండీ దవ్వయిపోవు
నిద్దపుఁ గల్లందమో నిజమందమో

(॥కల॥)
పాపపుణ్యా లంటెనంటాఁ బాయపు సుఖదుఃఖాలు
పైపై ననుభవించఁ బరసిపోవు
యే పొద్దు శ్రీవేంకటేశుఁ డెదలోనే వున్నాఁడు
యేపునఁ గల్లందమో యిది(???) నిజమందమో

(||pallavi||)
kalalona niṭlane kām̐puramu niṭlane
niluvu gallaṁdamo nijamaṁdamo

(||kala||)
vŏkkanāḍi prabaṁchamu vŏkkanāḍivalĕ rādu
vŏkka nimiṣhamuvalĕ nŏgaḍi gādu
pakkana māyamaibovu baḍibaḍine vachchu
nĕkkŏni kallaṁdamo nijamaṁdamo

(||kala||)
pŏddu vŏḍasedi gŏṁta pŏddu gūm̐kedi gŏṁta
saddi gŏṁta vem̐ḍi gŏṁta savulu gŏṁta
vŏddane kālamunuṁḍu vuṁḍuṁḍī davvayibovu
niddabum̐ gallaṁdamo nijamaṁdamo

(||kala||)
pābabuṇyā laṁṭĕnaṁṭām̐ bāyabu sukhaduḥkhālu
paibai nanubhaviṁcham̐ barasibovu
ye pŏddu śhrīveṁkaḍeśhum̐ ḍĕdalone vunnām̐ḍu
yebunam̐ gallaṁdamo yidi(???) nijamaṁdamo