(॥పల్లవి॥)
కలగంప వలపాయ కాదా మరి
కల దెచ్చి పై వేసేవు కాదా మరి
(॥కలగంప॥)
యెక్కడో యెవ్వతెసుద్దు లిటు నీమతిఁ బారితే
గక్కన నాతో నవ్వేవు కాదా మరి
దక్కియున్నయాపె మీఁది తమక మిట్టె తలఁచి
కక్కసించేవు రతికి కాదా మరి
(॥కలగంప॥)
యిరవైన నీమోహ మిట్టె పైఁ గుమ్మరించి
కరఁగి చెమరించేవు కాదా మరి
యెరవుల కాతరాన యెదిరి ని న్నెఱుఁగక
గరువపు మా టాడేవు కాదా మరి
(॥కలగంప॥)
చలివాసి ఆపెనీడ సరిచేసు లాడుకొంటా
కలసితి విటు నన్ను కాదా మరి
చెలులెల్లా నొక్కటె శ్రీవేంకటేశ్వర నీకు
కలిగె నిద్దరి మేలు కాదా మరి
(||pallavi||)
kalagaṁpa valabāya kādā mari
kala dĕchchi pai vesevu kādā mari
(||kalagaṁpa||)
yĕkkaḍo yĕvvadĕsuddu liḍu nīmadim̐ bāride
gakkana nādo navvevu kādā mari
dakkiyunnayābĕ mīm̐di tamaga miṭṭĕ talam̐si
kakkasiṁchevu radigi kādā mari
(||kalagaṁpa||)
yiravaina nīmoha miṭṭĕ paim̐ gummariṁchi
karam̐gi sĕmariṁchevu kādā mari
yĕravula kādarāna yĕdiri ni nnĕṟum̐gaga
garuvabu mā ṭāḍevu kādā mari
(||kalagaṁpa||)
salivāsi ābĕnīḍa sarisesu lāḍugŏṁṭā
kalasidi viḍu nannu kādā mari
sĕlulĕllā nŏkkaḍĕ śhrīveṁkaḍeśhvara nīgu
kaligĕ niddari melu kādā mari