కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ
(॥పల్లవి॥)
కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ
అలబలములు చేసీ నలమేలుమంగ
(॥కలకల॥)
బోన మింటిలోననుండి పొద్దు వొద్దు హరికిని
సేనగా వింతచవులు సేయించి
తానే వడ్డించేవంటా తగఁ గీలుగంటుతోడ
ఆనిపట్టి కాచుకున్న దలమేలుమంగ
(॥కలకల॥)
పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైఁడిపీఁటమీఁద
చక్కఁగఁ గూర్చుండి పరిచారకులతో
ఉక్కుమీరఁ బనులెల్లా వూడిగేలవారిచేత
నక్కరతోఁ జేయించీ నలమేలుమంగ
(॥కలకల॥)
శ్రీవేంకటపతికి చేసురటి విసరుతా
వావిరిఁ దనచెలుల వడ్డించు మని
దేవుఁడు తన చేయి వట్టి తియ్యగాఁ బొత్తుననుండి
యావిదాన నారగించె నలమేలుమంగ
(||pallavi||)
kalagala navvudoḍa kaligi sūbuladoḍa
alabalamulu sesī nalamelumaṁga
(||kalagala||)
bona miṁṭilonanuṁḍi pŏddu vŏddu harigini
senagā viṁtasavulu seyiṁchi
tāne vaḍḍiṁchevaṁṭā tagam̐ gīlugaṁṭudoḍa
ānibaṭṭi kāsugunna dalamelumaṁga
(||kalagala||)
pĕkku sŏmmulu niṁchuga pĕdda paim̐ḍibīm̐ṭamīm̐da
sakkam̐gam̐ gūrsuṁḍi parisāragulado
ukkumīram̐ banulĕllā vūḍigelavāriseda
nakkaradom̐ jeyiṁchī nalamelumaṁga
(||kalagala||)
śhrīveṁkaḍabadigi sesuraḍi visarudā
vāvirim̐ danasĕlula vaḍḍiṁchu mani
devum̐ḍu tana seyi vaṭṭi tiyyagām̐ bŏttunanuṁḍi
yāvidāna nāragiṁchĕ nalamelumaṁga