Kalagaalamu yimdum gala dimte harim

కలకాలము యిందుఁ గల దింతె హరిఁ
Language

(॥పల్లవి॥)
కలకాలము యిందుఁ గల దింతె హరిఁ
దలఁపులోఁ దలఁచని తప్పె కలిగి

(॥కల॥)
ఎన్నిలేవు పనులు యెంచుకొని సేసేమంటే
పన్నిన జంత్రముల యీ ప్రాణికి
యిన్నిటాఁ దొల్లేమి గంటి మింకాఁ గనే దేమి
అన్నిటా దురాశల ఆలపే కలిగె

(॥కల॥)
లంపటి మెంత లేదు లలిఁ గట్టుకొనే మంటే
తెంపుల తెఱఁగులేని దేహికిని
యింఠాల నిన్నాళ్లాయ యీ పాటెన్వరి కెక్కే
జంపుల మాయలలోని సటలే కలిగె

(॥కల॥)
యెంత యెడ లేదు యింత కీ సంసారములోన
మంతనపుఁ గోరికలు మనుజునికి
యింతలోనే శ్రీవేంకటేశునిఁ గొలిచి తేను
సంతోసము లెల్లఁ జేరి జయమే కలిగె

(||pallavi||)
kalagālamu yiṁdum̐ gala diṁtĕ harim̐
dalam̐pulom̐ dalam̐sani tappĕ kaligi

(||kala||)
ĕnnilevu panulu yĕṁchugŏni sesemaṁṭe
pannina jaṁtramula yī prāṇigi
yinniḍām̐ dŏllemi gaṁṭi miṁkām̐ gane demi
anniḍā durāśhala ālabe kaligĕ

(||kala||)
laṁpaḍi mĕṁta ledu lalim̐ gaṭṭugŏne maṁṭe
tĕṁpula tĕṟam̐guleni dehigini
yiṁṭhāla ninnāḽlāya yī pāḍĕnvari kĕkke
jaṁpula māyalaloni saḍale kaligĕ

(||kala||)
yĕṁta yĕḍa ledu yiṁta kī saṁsāramulona
maṁtanabum̐ gorigalu manujunigi
yiṁtalone śhrīveṁkaḍeśhunim̐ gŏlisi tenu
saṁtosamu lĕllam̐ jeri jayame kaligĕ