కలకాల మిందులకే కాచుకుంటివా
(॥పల్లవి॥)
కలకాల మిందులకే కాచుకుంటివా
చెలికతె(త్తె?)వైనా నేమి సిగ్గుదెచ్చుకొంటివే
(॥కల॥)
చెక్కులపై చెమటలు సెలవుల నగవులు
యెక్కడనుండి వచ్చెనే ఇంతలోనీకు
చొక్కపునాపతిఁ బిలుచుకరా నంపితి నింతే
చక్కఁగా నిప్పుడే యెట్టు సందించుకొంటివే
(॥కల॥)
మోవిమీఁది చెనకులు ముంగురులచెదరులు
వేవేగ నమరెఁగదే వేడుకతోను
సోవల నాతనిమైఁ గస్తూరి పూయునుంటి నింతే
తావుకొని యెటువలెఁ దగిలించుకొంటివే
(॥కల॥)
నిలువునఁబులకలు నిట్టూరుపులగములు
సులభాన నబ్బెఁగదె సొంపున నేఁడు
కలసే శ్రీ వేంకటేశుఁ గాచుకుండుమంటి నింతే
లలిఁ జుట్టముగా నెటువలెఁ జేసుకొంటివే
(||pallavi||)
kalagāla miṁdulage kāsuguṁṭivā
sĕligadĕ(ttĕ?)vainā nemi siggudĕchchugŏṁṭive
(||kala||)
sĕkkulabai sĕmaḍalu sĕlavula nagavulu
yĕkkaḍanuṁḍi vachchĕne iṁtalonīgu
sŏkkabunābadim̐ bilusugarā naṁpidi niṁte
sakkam̐gā nippuḍe yĕṭṭu saṁdiṁchugŏṁṭive
(||kala||)
movimīm̐di sĕnagulu muṁgurulasĕdarulu
vevega namarĕm̐gade veḍugadonu
sovala nādanimaim̐ gastūri pūyunuṁṭi niṁte
tāvugŏni yĕḍuvalĕm̐ dagiliṁchugŏṁṭive
(||kala||)
niluvunam̐bulagalu niṭṭūrubulagamulu
sulabhāna nabbĕm̐gadĕ sŏṁpuna nem̐ḍu
kalase śhrī veṁkaḍeśhum̐ gāsuguṁḍumaṁṭi niṁte
lalim̐ juṭṭamugā nĕḍuvalĕm̐ jesugŏṁṭive