Kalagaala mevvarigim gaam baaduvade dehi

కలకాల మెవ్వరికిఁ గాఁ బాటువడె దేహి
Language

(॥పల్లవి॥)
కలకాల మెవ్వరికిఁ గాఁ బాటువడె దేహి
వలలఁ బడి తుద నొకరివాఁడుఁ గాఁడాయ

(॥కల॥)
పాపకర్మపు మనసు పంచేంద్రియములకె
చూపిచ్చెఁ గాని దయఁ జూడ దాయ
దీపనపుటన్యాయ దేహంబు రుచులకె
వాపించె నను మొకము వడిఁ దనుప దాయా

(॥కల॥)
సిగ్గుమాలిన వయసు చెలుల యెంగిలిమోవి
కొగ్గించి దొరతనం బొసఁగ దాయ
నుగ్గైన యీ యాస నూరుగురిఁ గొలిపించి
తగ్గించి గర్వంబు దరిచేర్ప దాయ

(॥కల॥)
మాలు గలసిన బదుకు మాయలోనె కలపి
యేలకో ఘనసుఖం బియ్య దాయ
యీలోన శ్రీవేంకటేశ్వరుఁడు ననుఁ గాచె
నాలోని పొందికలు నాకు నరు చాయా

(||pallavi||)
kalagāla mĕvvarigim̐ gām̐ bāḍuvaḍĕ dehi
valalam̐ baḍi tuda nŏgarivām̐ḍum̐ gām̐ḍāya

(||kala||)
pābagarmabu manasu paṁcheṁdriyamulagĕ
sūbichchĕm̐ gāni dayam̐ jūḍa dāya
dībanabuḍanyāya dehaṁbu rusulagĕ
vābiṁchĕ nanu mŏgamu vaḍim̐ danuba dāyā

(||kala||)
siggumālina vayasu sĕlula yĕṁgilimovi
kŏggiṁchi dŏradanaṁ bŏsam̐ga dāya
nuggaina yī yāsa nūrugurim̐ gŏlibiṁchi
taggiṁchi garvaṁbu dariserba dāya

(||kala||)
mālu galasina badugu māyalonĕ kalabi
yelago ghanasukhaṁ biyya dāya
yīlona śhrīveṁkaḍeśhvarum̐ḍu nanum̐ gāsĕ
nāloni pŏṁdigalu nāgu naru sāyā