Kaladidivo sukhamu galiginanu garbhamu niluvaga maanunaa

కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా
Language

(॥పల్లవి॥)
కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా
మలసి కామ్యకర్మములకుఁ జొచ్చిన మగుడఁ బుట్టువులు మానునా

(॥కల॥)
పరగ నింద్రజిత్తుఁడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబునఁ గట్టి
అరయ నందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలె
పరిపరివిధముల నిటువలెనే హరిఁ బ్రపత్తి నమ్మిన నరుఁడు
తిరుగఁ గర్మమార్గమునకుఁ జొచ్చిన దేవుఁడు దనవాత్సల్యము వదలు

(॥కల॥)
అలరిన సంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుఁడు
తలఁపుచు నొకయిఱ్ఱిఁ బెంచినంతనే తనకును నారూపు దగిలె
ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడి నరుఁడు
వలవని దుస్సంగతులు పెంచినను వాసన లంటక మానునా

(॥కల॥)
అటుగన తాఁ బట్టిన వ్రత ముండఁగ నన్యమతము చేపట్టినను
నటనల నెందునుఁ బొందక జీవుఁడు నడుమనె మోరుఁడైనట్లు
తటుకస శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజియించిన నరుఁడు
ఘటనల నాతని కైంకర్యములకు కడుఁబాత్రుఁడు గాక మానునా

(||pallavi||)
kaladidivo sukhamu galiginanu garbhamu niluvaga mānunā
malasi kāmyagarmamulagum̐ jŏchchina maguḍam̐ buṭṭuvulu mānunā

(||kala||)
paraga niṁdrajittum̐ḍu hanumaṁtuni brahmāstraṁbunam̐ gaṭṭi
araya naṁdubai mogulu gaṭṭina nalabrahmāstramu vadalĕ
paribarividhamula niḍuvalĕne harim̐ brabatti nammina narum̐ḍu
tirugam̐ garmamārgamunagum̐ jŏchchina devum̐ḍu danavātsalyamu vadalu

(||kala||)
alarina saṁsārabhrama viḍisi yaḍavilona jaḍabharadum̐ḍu
talam̐pusu nŏgayiṭrim̐ bĕṁchinaṁtane tanagunu nārūbu dagilĕ
mulugusu laṁpaḍamulu dĕga viḍisi mokṣhamu vĕdagĕḍi narum̐ḍu
valavani dussaṁgadulu pĕṁchinanu vāsana laṁṭaga mānunā

(||kala||)
aḍugana tām̐ baṭṭina vrada muṁḍam̐ga nanyamadamu sebaṭṭinanu
naḍanala nĕṁdunum̐ bŏṁdaga jīvum̐ḍu naḍumanĕ morum̐ḍainaṭlu
taḍugasa śhrīveṁkaḍabadi nŏkkani dāsyamu bhajiyiṁchina narum̐ḍu
ghaḍanala nādani kaiṁkaryamulagu kaḍum̐bātrum̐ḍu gāga mānunā