(॥పల్లవి॥)
కలదిది సహజము కాంతలకు
నెలకొని యెటు కృప నించేవో కాని
(॥కల॥)
నెపము లెఱుఁగుదురు నేర్పు లెఱుఁగుదురు
వుపమ లెఱుంగుదు రువిదలు
కపట మెఱంగరు కాంతుని సొలతురు
యిపుడిఁక నీమన సెటున్నదో
(॥కల॥)
కూరిమి మఱవరు కూటమి మఱవరు
వోరుపు మరవరు వువిదలు
పోరులు మఱతురు పొరిఁ బతిఁ గలతురు
చేరి యేమి ఇఁకఁ జేయఁగఁగలవో
(॥కల॥)
పొరుగుకు వత్తురు భోగించవత్తురు
వొరిమెకు వత్తురు వువిదలు
వెరపుతోడ శ్రీవేంకటేశ్వరుఁడ
యిరవుగఁ గూడితి వింపుమరేదో
(||pallavi||)
kaladidi sahajamu kāṁtalagu
nĕlagŏni yĕḍu kṛpa niṁchevo kāni
(||kala||)
nĕbamu lĕṟum̐guduru nerbu lĕṟum̐guduru
vubama lĕṟuṁgudu ruvidalu
kabaḍa mĕṟaṁgaru kāṁtuni sŏladuru
yibuḍim̐ka nīmana sĕḍunnado
(||kala||)
kūrimi maṟavaru kūḍami maṟavaru
vorubu maravaru vuvidalu
porulu maṟaduru pŏrim̐ badim̐ galaduru
seri yemi im̐kam̐ jeyam̐gam̐galavo
(||kala||)
pŏrugugu vatturu bhogiṁchavatturu
vŏrimĕgu vatturu vuvidalu
vĕrabudoḍa śhrīveṁkaḍeśhvarum̐ḍa
yiravugam̐ gūḍidi viṁpumaredo