(॥పల్లవి॥)
కలదిదె మాట కట్టినయాట
చెలువుఁడు తనయిచ్చ సేసినట్టు సేయనీ
(॥కల॥)
పంతము తనతో నాడి బలిమి సేయఁగ నోప
కాంతఁ దనసేవ సేయఁగలదానను
దొంతి నున్నవలపులు దోమటి దొడుకుకొంటా
చెంతల నే నుండఁగాను సేనినట్టు సేయనీ
(॥కల॥)
మంకు దనతో నెరపి మాయలు సేయఁగనోప
అంకెఁ దనయిచ్చలోనిఆఁటదానను
లంకెలఁ దాఁ జేసినట్టి లచ్చనలు చూచుకొంటా
చింకచూపుల నుండఁగఁ జేసినట్టుసేయనీ
(॥కల॥)
కందువలఁ దన్నుఁ గూడి కడకుఁ బాయఁగనోప
సందడి రతుల తనజంట దానను
అందపు శ్రీవేంకటేశుఁడైనతన్నుఁ బాడుకొంటా
చెంది కాఁగిట నుందాన సేసినటు సేయనీ
(||pallavi||)
kaladidĕ māḍa kaṭṭinayāḍa
sĕluvum̐ḍu tanayichcha sesinaṭṭu seyanī
(||kala||)
paṁtamu tanado nāḍi balimi seyam̐ga noba
kāṁtam̐ danaseva seyam̐galadānanu
dŏṁti nunnavalabulu domaḍi dŏḍugugŏṁṭā
sĕṁtala ne nuṁḍam̐gānu seninaṭṭu seyanī
(||kala||)
maṁku danado nĕrabi māyalu seyam̐ganoba
aṁkĕm̐ danayichchaloniām̐ṭadānanu
laṁkĕlam̐ dām̐ jesinaṭṭi lachchanalu sūsugŏṁṭā
siṁkasūbula nuṁḍam̐gam̐ jesinaṭṭuseyanī
(||kala||)
kaṁduvalam̐ dannum̐ gūḍi kaḍagum̐ bāyam̐ganoba
saṁdaḍi radula tanajaṁṭa dānanu
aṁdabu śhrīveṁkaḍeśhum̐ḍainadannum̐ bāḍugŏṁṭā
sĕṁdi kām̐giḍa nuṁdāna sesinaḍu seyanī