Kaladi yeemoordivalla gadi ganavalenu

కలది యీమూర్తివల్ల గతి గనవలెను
Language

(॥పల్లవి॥)
కలది యీమూర్తివల్ల గతి గనవలెను
యిల నిందు నమ్మకుంటే యెందు మరి లేదు

(॥కల॥)
కంటిమా బ్రహ్మమును వేంకటపతిఁ గనినట్టు
కంటిమా అవతారాలు కతలె కాక
కంటిమా హృదయములోఁ గలిగిన దైవమును
కంటిమా వైకుంఠముకడవారైనాను

(॥కల॥)
తెలిసీనా జ్ఞానము యీదేవుని మహిమవలె
తెలిసీనా వేదాలు సందేహమే కాక
తెలిసీనా మాయ యిది యెంత చదివినా
తెలిసీనా ముందరితెరువు వెదకితే

(॥కల॥)
చిక్కీనా మనసు యీశ్రీవేంకటేశ్వరువలె
చిక్కీనా ధ్యానము వట్టిచింతలేకాక
చిక్కీనా అనాదినుండి చిగిరించీ కాలము
చిక్కీనా పెద్దలు చెప్పే జితమైన శాంతి

(||pallavi||)
kaladi yīmūrdivalla gadi ganavalĕnu
yila niṁdu nammaguṁṭe yĕṁdu mari ledu

(||kala||)
kaṁṭimā brahmamunu veṁkaḍabadim̐ ganinaṭṭu
kaṁṭimā avadārālu kadalĕ kāga
kaṁṭimā hṛdayamulom̐ galigina daivamunu
kaṁṭimā vaiguṁṭhamugaḍavārainānu

(||kala||)
tĕlisīnā jñānamu yīdevuni mahimavalĕ
tĕlisīnā vedālu saṁdehame kāga
tĕlisīnā māya yidi yĕṁta sadivinā
tĕlisīnā muṁdaridĕruvu vĕdagide

(||kala||)
sikkīnā manasu yīśhrīveṁkaḍeśhvaruvalĕ
sikkīnā dhyānamu vaṭṭisiṁtalegāga
sikkīnā anādinuṁḍi sigiriṁchī kālamu
sikkīnā pĕddalu sĕppe jidamaina śhāṁti