కలదా తొల్లి మీ కతలు చెప్పేరు నేఁడు
(॥పల్లవి॥)
కలదా తొల్లి మీ కతలు చెప్పేరు నేఁడు
బలువాఁడు గదవమ్మ పాయపు నీ మగఁడు
(॥కల॥)
జడల సొల్లెము సుట్టి సరి వీఁకవిల్లు వట్టి
వెడదవా తంపపొది వీఁపునఁగట్టి
పొడలమెకము నేసి పొడవాటిరాకాసి
గొడవలఁ దీసెనట కోరి నీమగఁడు
(॥కల॥)
నారపట్టుసీర గప్పి నవ్వు సెలవుల గుప్పి
సారె రుషులకు బాసలు సేసి
కూరగాయపొలమాడి కొనబుతమ్మునిఁగూడి
మేరమీరెనట నాడు మేసులనీమగఁడు
(॥కల॥)
కోఁతులమూఁకల నేలి కొంకక బూమికి సాలి
నీతోడ సుట్టాలుఁ దాను నిదులఁ దేలి
యీతల సివేంకటాద్రి యెక్కి మమ్ముఁ గిపఁ జూచె
బాఁతితో నిన్నెద మోచె బాగ్యపునీమగఁడు
(||pallavi||)
kaladā tŏlli mī kadalu sĕpperu nem̐ḍu
baluvām̐ḍu gadavamma pāyabu nī magam̐ḍu
(||kala||)
jaḍala sŏllĕmu suṭṭi sari vīm̐kavillu vaṭṭi
vĕḍadavā taṁpabŏdi vīm̐punam̐gaṭṭi
pŏḍalamĕgamu nesi pŏḍavāḍirāgāsi
gŏḍavalam̐ dīsĕnaḍa kori nīmagam̐ḍu
(||kala||)
nārabaṭṭusīra gappi navvu sĕlavula guppi
sārĕ ruṣhulagu bāsalu sesi
kūragāyabŏlamāḍi kŏnabudammunim̐gūḍi
meramīrĕnaḍa nāḍu mesulanīmagam̐ḍu
(||kala||)
kom̐tulamūm̐kala neli kŏṁkaga būmigi sāli
nīdoḍa suṭṭālum̐ dānu nidulam̐ deli
yīdala siveṁkaḍādri yĕkki mammum̐ gibam̐ jūsĕ
bām̐tido ninnĕda mosĕ bāgyabunīmagam̐ḍu