Kala mee sahajaanagu kannula mechchuda gaaga

కల మీ సహజానకు కన్నుల మెచ్చుట గాక
Language

(॥పల్లవి॥)
కల మీ సహజానకు కన్నుల మెచ్చుట గాక
తలపోసి మి మ్మడుగఁ దగవా యీవేళనూ

(॥కల॥)
పడఁతి నీమోము చూచి పకపక నవ్వు నవ్వి
చిడుముడి నీచేతిపై చేయి వేసేను
అడరి మీలోని మర్మా లనవి యేమి గలవో
తడవఁగ మాకు నంత దగవా యీవేళను

(॥కల॥)
సారె సారె సన్న సేసి చాయలు దొరల నాడి
మోరతోపుఁదనమున మొక్కు మొక్కెను
కారణ మేఁటికో కాని కందువ మీకే తెలుసు
తారుకాణించఁగ మాకుఁ దగవా యీవేళను

(॥కల॥)
చెనకి పాదము దొక్కి చెలిలోన మాట చెప్పి
ఘనముగ నిన్ను నాపె కాఁగిలించెను
అనుగు శ్రీవెంకటేశ ఆడుకోలుమాటలేవో
తనివి నిట్టె పొగడఁ దగవా యీవేళనూ

(||pallavi||)
kala mī sahajānagu kannula mĕchchuḍa gāga
talabosi mi mmaḍugam̐ dagavā yīveḽanū

(||kala||)
paḍam̐ti nīmomu sūsi pagabaga navvu navvi
siḍumuḍi nīsedibai seyi vesenu
aḍari mīloni marmā lanavi yemi galavo
taḍavam̐ga māgu naṁta dagavā yīveḽanu

(||kala||)
sārĕ sārĕ sanna sesi sāyalu dŏrala nāḍi
moradobum̐danamuna mŏkku mŏkkĕnu
kāraṇa mem̐ṭigo kāni kaṁduva mīge tĕlusu
tārugāṇiṁcham̐ga māgum̐ dagavā yīveḽanu

(||kala||)
sĕnagi pādamu dŏkki sĕlilona māḍa sĕppi
ghanamuga ninnu nābĕ kām̐giliṁchĕnu
anugu śhrīvĕṁkaḍeśha āḍugolumāḍalevo
tanivi niṭṭĕ pŏgaḍam̐ dagavā yīveḽanū