Kala deeyimtigi garvaalu | yetti

కల దీయింతికి గర్వాలు । యెత్తి
Language

(॥పల్లవి॥)
కల దీయింతికి గర్వాలు । యెత్తి
పొలసీ నీ పుట్టుపూర్వాలు

(॥కల॥)
విడువ దె(దెం?)తైనా దుస్సీ నీ
పడఁతి నీమీఁద పంతాలు
బడిబడి నీపై నట్టె చాఁపీని
కొడిమచూపులకొంతాలు

(॥కల॥)
క్రియగూడ నిన్నుఁ గిందుమీఁదు సేసీ
ప్రియురాలిఁ జూడు బీరాలు
రయమున నీరతికేలిలోనే
నియత నిన్నెంచీ నేరాలు

(॥కల॥)
కలసి నిన్నిట్టె కాఁగిట ముట్టీని
అలమేలుమంగ ఆయాలు
యెలమి శ్రీవేంకటేశ సరసాన
తలఁగక యాడీ దాయాలు

(||pallavi||)
kala dīyiṁtigi garvālu | yĕtti
pŏlasī nī puṭṭubūrvālu

(||kala||)
viḍuva dĕ(dĕṁ?)tainā dussī nī
paḍam̐ti nīmīm̐da paṁtālu
baḍibaḍi nībai naṭṭĕ sām̐pīni
kŏḍimasūbulagŏṁtālu

(||kala||)
kriyagūḍa ninnum̐ giṁdumīm̐du sesī
priyurālim̐ jūḍu bīrālu
rayamuna nīradigelilone
niyada ninnĕṁchī nerālu

(||kala||)
kalasi ninniṭṭĕ kām̐giḍa muṭṭīni
alamelumaṁga āyālu
yĕlami śhrīveṁkaḍeśha sarasāna
talam̐gaga yāḍī dāyālu