కక్కసించ నేఁటికి ఘనుఁడ నీ వప్పటిని
(॥పల్లవి॥)
కక్కసించ నేఁటికి ఘనుఁడ నీ వప్పటిని
చెక్కు నొక్కేవు నీమాఁట సేయ ననేనా
(॥కక్క॥)
చేరువఁ గూచుండితివి చేయిపైఁ జేయి వేసేవు
గారవించే వన్నిమేళ్లు గంటి నీవల్ల
సారపుఁగాంతలు చల్లే సణఁగుల కేమి సేతువు
వూరట నీతోడి పొందు వోపననేనా
(॥కక్క॥)
వీడెము నా కిచ్చితివి వేడుకలు రేఁచేవు
పాడితోడ నావలపు పండె నీవల్ల
వూడిగపు నీకాంతల వుప్పతింపుల కేమందు
మేడెపు నీరతులకు మెచ్చననేనా
(॥కక్క॥)
కలసితి విదె నాపైఁ గప్పురాలు చల్లేవు
నలువంకఁ దని వందె నామనసు
నిలిచి శ్రీ వేంకటేశ నీవారి నెట్టు నమ్మింతు
కొలఁది మీరితే నన్నుఁ గొరఁ తెంచేనా
(||pallavi||)
kakkasiṁcha nem̐ṭigi ghanum̐ḍa nī vappaḍini
sĕkku nŏkkevu nīmām̐ṭa seya nanenā
(||kakka||)
seruvam̐ gūsuṁḍidivi seyibaim̐ jeyi vesevu
gāraviṁche vannimeḽlu gaṁṭi nīvalla
sārabum̐gāṁtalu salle saṇam̐gula kemi seduvu
vūraḍa nīdoḍi pŏṁdu vobananenā
(||kakka||)
vīḍĕmu nā kichchidivi veḍugalu rem̐sevu
pāḍidoḍa nāvalabu paṁḍĕ nīvalla
vūḍigabu nīgāṁtala vuppadiṁpula kemaṁdu
meḍĕbu nīradulagu mĕchchananenā
(||kakka||)
kalasidi vidĕ nābaim̐ gappurālu sallevu
naluvaṁkam̐ dani vaṁdĕ nāmanasu
nilisi śhrī veṁkaḍeśha nīvāri nĕṭṭu nammiṁtu
kŏlam̐di mīride nannum̐ gŏram̐ tĕṁchenā