Kakkasa mibude kaavalenaa

కక్కస మిపుడే కావలెనా
Language

(॥పల్లవి॥)
కక్కస మిపుడే కావలెనా
వొక్కించుక వడి వుండఁగరాదా

(॥॥)
నేరుపు మాటలు నీకే యమరును
కూరిమి గొసరఁగ గుఱి లేదు
తేరినయప్పుడె తెలిసేఁ గానీ
పోరక లోనికిఁ బోరాదా

(॥॥)
సెలవుల నవ్వుల చెల్లును నీకే
తలపెట్టఁ జలము తతిగాదు
వలసినయప్పుడె వచ్చెఁ గానీ
పలుమరుఁ బిలువక పదరాదా

(॥॥)
తమకించి కలయఁ దగవవు నీకే
జమళి నలుక లిఁకఁ జవిగావు
చెమరించె మేను శ్రీవేంకటేశ్వర
సమముగఁ గూడితి చనవీరాదా

(||pallavi||)
kakkasa mibuḍe kāvalĕnā
vŏkkiṁchuga vaḍi vuṁḍam̐garādā

(||||)
nerubu māḍalu nīge yamarunu
kūrimi gŏsaram̐ga guṟi ledu
terinayappuḍĕ tĕlisem̐ gānī
poraga lonigim̐ borādā

(||||)
sĕlavula navvula sĕllunu nīge
talabĕṭṭam̐ jalamu tadigādu
valasinayappuḍĕ vachchĕm̐ gānī
palumarum̐ biluvaga padarādā

(||||)
tamagiṁchi kalayam̐ dagavavu nīge
jamaḽi naluga lim̐kam̐ javigāvu
sĕmariṁchĕ menu śhrīveṁkaḍeśhvara
samamugam̐ gūḍidi sanavīrādā