Kaivasamai tanagu nem galadaananu

కైవసమై తనకు నేఁ గలదానను
Language

(॥పల్లవి॥)
కైవసమై తనకు నేఁ గలదానను
తావుల నా మనసెల్ల తా నెఱుఁగునే

(॥కైవసమై॥)
పెక్కుసతులు గలిగి పెద్దగా బదుక నీవే
చొక్కపుఁ గన్నుల దన్నుఁ జూచేఁ గాని
యిక్కువ నందరి సొమ్ము లెల్ల ధరించుకో నీవే
చక్కఁగా నేఁ బెట్టినంత సంతోసమూ

(॥కైవసమై॥)
వియ్యా లంది వీడుకూళ్లు వేమారుఁ గుడువ నీవే
వొయ్యనె తనకు లో నై వుండేఁ గాని
ప య్యాడినవారిచేతి బాగా లందుకో నీవే
యియ్యకో లై ఆకు మడి చిచ్చేఁ గాని

(॥కైవసమై॥)
సమరతి నుపరతి జల్లఁగా వెలయ నీవే
తమితో సేవలు నేసి దక్కేఁ గాని
అమర శ్రీవెంకేటశుఁ డట్టె నన్నుఁ గూడ నీవే
గుమి గూడి నేఁ గూడి గురి యైతి నిపుడూ

(||pallavi||)
kaivasamai tanagu nem̐ galadānanu
tāvula nā manasĕlla tā nĕṟum̐gune

(||kaivasamai||)
pĕkkusadulu galigi pĕddagā baduga nīve
sŏkkabum̐ gannula dannum̐ jūsem̐ gāni
yikkuva naṁdari sŏmmu lĕlla dhariṁchugo nīve
sakkam̐gā nem̐ bĕṭṭinaṁta saṁtosamū

(||kaivasamai||)
viyyā laṁdi vīḍugūḽlu vemārum̐ guḍuva nīve
vŏyyanĕ tanagu lo nai vuṁḍem̐ gāni
pa yyāḍinavārisedi bāgā laṁdugo nīve
yiyyago lai āgu maḍi sichchem̐ gāni

(||kaivasamai||)
samaradi nubaradi jallam̐gā vĕlaya nīve
tamido sevalu nesi dakkem̐ gāni
amara śhrīvĕṁkeḍaśhum̐ ḍaṭṭĕ nannum̐ gūḍa nīve
gumi gūḍi nem̐ gūḍi guri yaidi nibuḍū