కైలాటాలు వెట్టవద్దు కాంతల మిద్దరము
(॥పల్లవి॥)
కైలాటాలు వెట్టవద్దు కాంతల మిద్దరము
మేలము లాడుచు నిన్ను మెప్పించుకోరాదా
(॥కైలా॥)
నగ వెంతైనా నీవు నాలికాఁడ వడిగితే
తగవైనాఁ జెప్పరాదా దయతో మాకు
వొగి నీమాటకు లోను వొట్లు వెట్టుకొన్నారము
మొగమిచ్చి నవ్వి మాచే మొక్కించుకోరాదా
(॥కైలా॥)
చూడవు కానుకదిక్కు సొరిదిణ బట్టుకుండణగా
వీడెమైన నియ్యరాదా వేడుకతోను
జాడతో నీవారమై సమ్మతించి వున్నారము
జోడు గూడి మాకు నిట్టె చుట్టమవు గారాదు
(॥కైలా॥)
మానవు నీ పంతములు మాతో శ్రీవేంకటేశ
తెనెమోవైనా నీరాదా దిష్టము గాను
ఆనుకొని కూడితివి అంతలో మమ్మిద్దరిని
తానకమై నీరతులు తలఁపించుకోరాదా
(||pallavi||)
kailāḍālu vĕṭṭavaddu kāṁtala middaramu
melamu lāḍusu ninnu mĕppiṁchugorādā
(||kailā||)
naga vĕṁtainā nīvu nāligām̐ḍa vaḍigide
tagavainām̐ jĕpparādā dayado māgu
vŏgi nīmāḍagu lonu vŏṭlu vĕṭṭugŏnnāramu
mŏgamichchi navvi māse mŏkkiṁchugorādā
(||kailā||)
sūḍavu kānugadikku sŏridiṇa baṭṭuguṁḍaṇagā
vīḍĕmaina niyyarādā veḍugadonu
jāḍado nīvāramai sammadiṁchi vunnāramu
joḍu gūḍi māgu niṭṭĕ suṭṭamavu gārādu
(||kailā||)
mānavu nī paṁtamulu mādo śhrīveṁkaḍeśha
tĕnĕmovainā nīrādā diṣhṭamu gānu
ānugŏni kūḍidivi aṁtalo mammiddarini
tānagamai nīradulu talam̐piṁchugorādā