కైకొని తనమాఁటలు గానిమ్మంటిని
(॥పల్లవి॥)
కైకొని తనమాఁటలు గానిమ్మంటిని
యీకడ నాగుణ మిది యేమి సేతునే
(॥కైకొని॥)
మంచిమాఁట లాడఁగాను మరి కోపంచఁగరాదు
కొంచక చెక్కునొక్కఁగా గుంపించరాదు
పొంచి తాఁజేసినచేఁత పోలించి చెప్పఁగరాదు
యెంచ మొగమోటదాన నే నేమిసేతునే
(॥కైకొని॥)
చన్నులపైఁ జేయిచాఁచఁగా చాలు నోప ననరాదు
కన్నులెదుట నవ్వఁగాఁ గాదనరాదు
వున్నతిఁ దనసుద్దులు వూకొని వినఁగరాదు
యెస్నైనా నిచ్చకురాల నేమిసేతునే
(॥కైకొని॥)
తక్కక కాఁగిలించఁగాఁ దప్పించుకొనరాదు
పుక్కిటివిడె మివ్వఁగఁ బోవఁగరాదు
యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
యిక్కువ సిగ్గరిక త్తె నేమి సేతునే
(||pallavi||)
kaigŏni tanamām̐ṭalu gānimmaṁṭini
yīgaḍa nāguṇa midi yemi sedune
(||kaigŏni||)
maṁchimām̐ṭa lāḍam̐gānu mari kobaṁcham̐garādu
kŏṁchaga sĕkkunŏkkam̐gā guṁpiṁcharādu
pŏṁchi tām̐jesinasem̐ta poliṁchi sĕppam̐garādu
yĕṁcha mŏgamoḍadāna ne nemisedune
(||kaigŏni||)
sannulabaim̐ jeyisām̐sam̐gā sālu noba nanarādu
kannulĕduḍa navvam̐gām̐ gādanarādu
vunnadim̐ danasuddulu vūgŏni vinam̐garādu
yĕsnainā nichchagurāla nemisedune
(||kaigŏni||)
takkaga kām̐giliṁcham̐gām̐ dappiṁchugŏnarādu
pukkiḍiviḍĕ mivvam̐gam̐ bovam̐garādu
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐gūḍĕ
yikkuva siggariga ttĕ nemi sedune