Kaigonavayyaa karivaradaa

కైకొనవయ్యా కరివరదా
Language

(॥పల్లవి॥)
కైకొనవయ్యా కరివరదా
నీకే శరణము నిలింపవరదా

(॥కైకొన॥)
పాండవవరదా పద్మజుని యజ్ఞ
గుండములో నున్న గురువరదా
మెండుగ ధ్రువునిని మెచ్చినవరదా
దండము నీ కిదె ద్రౌపది వరదా

(॥కైకొన॥)
బలివరదా యంబరీషవరదా
వలనగు నక్రూరవదరా
బలిమి నటించిన ప్రహ్లాదవరదా
కొలిచెద మిదె నిన్నుఁ గుచేలుని వరదా

(॥కైకొన॥)
నారదవరదా నమో శుకవరదా
సారస గుణ విభీషణవరదా
కారుణ్య శ్రీవేంకటగిరివరదా
చేరి నుతించెద శ్రీపతి వరదా

(||pallavi||)
kaigŏnavayyā karivaradā
nīge śharaṇamu niliṁpavaradā

(||kaigŏna||)
pāṁḍavavaradā padmajuni yajña
guṁḍamulo nunna guruvaradā
mĕṁḍuga dhruvunini mĕchchinavaradā
daṁḍamu nī kidĕ draubadi varadā

(||kaigŏna||)
balivaradā yaṁbarīṣhavaradā
valanagu nakrūravadarā
balimi naḍiṁchina prahlādavaradā
kŏlisĕda midĕ ninnum̐ guseluni varadā

(||kaigŏna||)
nāradavaradā namo śhugavaradā
sārasa guṇa vibhīṣhaṇavaradā
kāruṇya śhrīveṁkaḍagirivaradā
seri nudiṁchĕda śhrībadi varadā