(॥పల్లవి॥)
కైకొనవయ్యా ఘనుఁడవు
దీకొని మోహము దిగఁబోసీని
(॥కైకొన॥)
జంకెనచూపులు సరసపుమాఁటలు
సంకె లేక సతి చల్లీని
పొంకపుఁగొసరులు భోగపుటుసురులు
వుంకువగా నీకొనరించీని
(॥కైకొన॥)
సెలవులనవ్వులు సిగ్గులమొఱఁగులు
నెలకొని యంగన నించీని
చెలువపుతెక్కులు చేతులమొక్కులు
వొలిసి కప్పముగ నొసగీని
(॥కైకొన॥)
మొగములో కళలు ముంచినరతులును
నిగిడెలమేల్మంగ నించీని
అగపడి శ్రీవేంకటాధిప కూడితి
యిగురుమోవి నీకిచ్చీని
(||pallavi||)
kaigŏnavayyā ghanum̐ḍavu
dīgŏni mohamu digam̐bosīni
(||kaigŏna||)
jaṁkĕnasūbulu sarasabumām̐ṭalu
saṁkĕ lega sadi sallīni
pŏṁkabum̐gŏsarulu bhogabuḍusurulu
vuṁkuvagā nīgŏnariṁchīni
(||kaigŏna||)
sĕlavulanavvulu siggulamŏṟam̐gulu
nĕlagŏni yaṁgana niṁchīni
sĕluvabudĕkkulu sedulamŏkkulu
vŏlisi kappamuga nŏsagīni
(||kaigŏna||)
mŏgamulo kaḽalu muṁchinaradulunu
nigiḍĕlamelmaṁga niṁchīni
agabaḍi śhrīveṁkaḍādhiba kūḍidi
yigurumovi nīgichchīni